ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

HEALTH BENEFITS WITH GUAVA FRUIT - DENTAL CARE WITH GUAVA FRUIT


జామ...ఎంతో మేలు!

పేదవాడి ఆపిల్‌ అని చిన్నచూపు చూస్తాం కానీ మన పెరట్లో కాసే జామలో ఆపిల్‌లో కన్నా పోషకాలెక్కువ. సిట్రస్‌ జాతి పండ్లలో కన్నా ఇందులో సి -విటమిన్‌ నాలుగు నుంచి పది రెట్లు ఎక్కువ. ఇది అద్భుతమైన యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. హృద్రోగాలతోపాటు అనేక రకాల క్యాన్సర్లు రాకుండా కాపాడుతుంది. ఇందులోని పీచు మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. కాల్షియం, ఐరన్‌లు కూడా పుష్కలంగా ఉంటాయి. సోడియం, ఫాస్ఫరస్‌ వంటి ఖనిజాలు వ్యర్థాలను తొలగించడంలో మూత్రపిండాలకు సాయపడతాయి. దంత పరిరక్షణకూ జామ దివ్యౌషధం.