వేసవిలో కర్బూజ
వేసవిలో లభ్యమయ్యే పండ్లలో కర్బూజపండు ఒకింత ప్రత్యేకం. రుచితో పాటు శరీరానికి ఎంతో మేలు చేసే కర్బూజ పండు ఉపయోగాలేంటో తెల్సుకుందాం...!
అత్యధికంగా 92 శాతం నీరు ఉంటుంది కాబట్టే ఈ పండును చిన్నా, పెద్దా లేకుండా అందరూ ఇష్టపడతారు. దప్పిక తీర్చటంతో పాటు శరీరంలోని నీటిశాతాన్ని కాపాడుతుంది, శక్తినిస్తుంది.
ఎ-విటమిన్, సి-విటమిన్ పుష్కలంగా ఉండే ఈ పండులో పోషకవిలువలు ఎక్కువగా ఉంటాయి. ఇవి ముఖ్యంగా శరీరంలో ఫ్లూయిడ్స్ ను బ్యాలెన్స్ చేస్తాయి. వేసవిలో గర్భిణిలు వాటర్‌మెలన్‌ను తింటే శరీరంలోని ట్యాక్సిన్స్ తొలగిపోతాయి.
ఒక బౌల్ కర్బూజ పండ్ల ముక్కల్ని తింటే 40 శాతం లైకోపెన్ లభిస్తుంది. దీనివల్ల గుండె సమస్యలు దరికి చేరవు.
అధిక రక్తపోటు తగ్గించటంతో పాటు రక్తంలోని చక్కెరశాతాన్ని బ్యాలెన్స్ చేస్తుంది.
ఎముకల పటిష్టానికి ఉపయోగపడటంతో పాటు రోగనిరోధకశక్తిని పెంచే శక్తి కర్బూజపండుకు ఉంది.
ఈ పండు తింటే బరువు తగ్గే అవకాశం ఎక్కువగా ఉంది. కిడ్నీల ఆరోగ్యానికి కర్బూజపండు చక్కగా ఉపయోగపడుతుంది.
కంటి ఆరోగ్యం, శ్లేష్మాన్ని తగ్గించడానికి ఈ పండును తినాలి. వేసవిలో కర్బూజపండు ముక్కలతో పాటు జ్యూస్ తాగటం కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిది.