ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

What Are the Benefits of Gingelly Oil? NUVVULA NUNE UPAYOGALU - HEALTH BENEFITS WITH NUVVULA NUNE


నువ్వులనూనె ఉపయోగాలు - 
నువ్వులనూనె గుణాలు

ఆయుర్వేద శాస్త్రవేత్తలు అయిన మన మహర్షులు అందరు నువ్వులనూనె యొక్క గొప్పతనాన్ని గుర్తించి దానికి తమతమ గ్రంథాలలో చాలా ప్రాముఖ్యతని ఇచ్చారు. 

నువ్వులనూనె కి వేడిచేసే స్వభావం ఉంది. వగరు,తీపి రుచులు కలిగి బలకరం అయిన వీర్యవర్ధకం అయిన గుణాలు కలిగి ఉంటుంది. వెంట్రుకల పెరుగుదలకు , ద్రుడత్వానికి , నల్లదనానికి నువ్వులనూనె బాగా ఉపకరిస్తుంది. శరీరానికి నునుపు,కాంతిని ప్రసాదించి చర్మవ్యాధులు రాకుండా కాపాడుతుంది.

నువ్వులనూనె వాడటం వలన కలుగు ప్రయోజనాలు -

నువ్వులనూనె మనిషి పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు ప్రతి నిత్యం నువ్వులనూనె వాడుకోవాలి అని ఆయుర్వేద శాస్త్రకారులు తెలియజేసారు.

రెండు ముక్కు రంధ్రాలలో రెండురెండు చుక్కలు , రెండు చెవులలో రెండురెండు చుక్కలు నువ్వులనూనె వేసుకోవాలి అని సూచించారు. దీనివల్ల మెడపైన వచ్చే శిరొవ్యాధులు , నాసికావ్యాధులు , నేత్రవ్యాదులు , చెవివ్యాధులు , దంతవ్యాధులు మొదలయిన 231 రకాల వ్యాదులు నివారించ వచ్చు.

దీని యెక్క అర్దం ఆయా వ్యాధులు వచ్చాక నువ్వులనూనె వాడితే ప్రయోజనం ఉంటుంది అని కాదు. దీనిని వాడటం ఒక ఆచారంగా , ఒక అలవాటుగా వాడుతూ ఉంటే శిరస్సులో సర్వభాగాలు శక్తివంతం అయ్యి భవిష్యత్తులో ఏ రకమయిన తల వ్యాదులు రాకుండా కాపాడుకోవచ్చు అని ముందు జాగ్రత్తగా సూచించారు .

ఇలా వాడటం వలన భవిష్యత్తులో చెవులకు సంభందించిన చెవుడు , చెవిలో చీము , చెవిపోటు , చెవిహోరు వంటి వ్యాదులని , కంటి మసకలు , పొరలు , కంటి రెప్పల మీద వెంట్రుకలు ఉడిపోవడం వంటి నేత్రవ్యాధులను , దంతాలు పుచ్చిపోవడం , చిగుళ్లు నుంచి రక్తం కారడం , దంతాలు ఉడిపోవడం వంటి వ్యాదులని , సైనసైటిస్ , జలుబు, ఎడినాయిడ్స్ వంటి నాసికా వ్యాదుల్ని , ఆకాలంలో జుట్టు నెరవడం , జుట్టు ఉడటం , బట్టతల కావడం వంటి కేశవ్యాదులని , నత్తి , మూగతనం వంటి వ్యాదులని రాకుండా కాపాడుకోవచ్చు అని సదాశయంతో ఒక్క పైసా ఖర్చు లేకుండా మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవచ్చు.

శుశ్రుతుడు తన శుశ్రుత సంహితలో నువ్వులనూనె గురించి చాలా వివరంగా వివరించారు. నువ్వులనూనె ని ఉపయోగించడం వలన వ్యాదులు రాకుండా ఉండటం తో పాటు కాలాలు , ఋతువులు మారినప్పుడు వాతావరణ భేదాల వలన ఆహారంలో తేడాల వలన వ్యాధులుగా పరిగణించ బోయే పరిస్థితి కూడా మారిపొతుంది అని చరక మహర్షి కూడా తెలియజేశారు .


చెవి, ముక్కు, గొంతుకు సంభందించిన సకల శరీర భాగాలను శక్తివంతం చేసే అద్బుత ప్రక్రియ నువ్వులనూనె వాడకం అని శుశ్రుతుడు తెలియజేసెను .

నోటి పరిమళానికి , దవడలు , దంతాలు , శిరస్సు, మెడకొంకులు , గొంతు,భుజాలు , వక్షస్తలం , వెంట్రుకలు మొదలయిన భాగాలు అన్ని ద్రుడతరంగా ఉండాలి అంటే నువ్వులనూనె ని నస్యం చేయక తప్పదు అని వక్కాణించారు.