రొయ్యలు గోంగూర వడియాలు కలిపి...
కావల్సినవి: గోంగూర - కప్పు, రొయ్యలు - రెండుకప్పులు, పిండి వడియాలు - కప్పు, నూనె - వేయించేందుకు సరిపడా, పచ్చిమిర్చి - రెండు, ఉల్లిపాయ ముద్ద - పావుకప్పు, ఉప్పు - తగినంత, కారం - ఒకటిన్నర చెంచా, వెల్లుల్లి రెబ్బలు - నాలుగు, జీలకర్ర, ఆవాలు - అరచెంచా చొప్పున, అల్లంవెల్లుల్లి పేస్టు - చెంచా.
తయారీ: ముందుగా బాణలిలో అరకప్పు నూనె తీసుకుని పొయ్యిమీద పెట్టాలి. అది వేడయ్యాకవడియాలు వేయించుకుని తీసి పెట్టుకోవాలి. రొయ్యల్ని శుభ్రం చేసి వాటికి అల్లంవెల్లుల్లి పేస్టూ, కొద్దిగా కారం, ఉప్పూ పట్టించి పెట్టుకోవాలి. వడియాలు వేయించిన బాణలిలోనే మరికొంచెం నూనె వేసి రొయ్యల్ని వేయించి తీసుకోవాలి. కాసేపటికి అవి మెత్తగా అవుతాయి. అప్పుడు దింపేయాలి. మరో బాణలిలో రెండు చెంచాల నూనె వేడి చేసి వెల్లుల్లి రెబ్బలూ, జీలకర్రా, ఆవాలూ, కరివేపాకు రెబ్బలూ, ఉల్లిపాయ ముద్దా వేయించుకోవాలి. ఉల్లిపాయ ముద్దలోని పచ్చివాసన పోయాక వేయించుకున్న రొయ్యలూ, గోంగూర వేసేయాలి. తరవాత అరకప్పు నీళ్లూ, తగినంత ఉప్పూ, మిగిలిన కారం వేసి మంట తగ్గించాలి. గోంగూర పూర్తిగా మగ్గి, ఇది కూరలా తయారయ్యాక ముందుగా వేయించుకున్న వడియాలు వేసి ఐదు నిమిషాలయ్యాక దింపేయాలి.