భయంకరమైన కథ!!
(ఒంటరిగా రాత్రిపూట చదవవద్దు.. గుండె జబ్బు ఉన్నవాళ్ళుఅసలు చదువొద్దు)
ఒక ముసలి వాడు వర్షంలో గొడుగేసుకుని మసక చీకట్లో
ఒక పుస్తకం అమ్ముతున్నాడు.
ఒక యువకుడు అతని దగ్గరకి వచ్చి " ఎంత పుస్తకం ? " అన్నాడు.
ముసలివాడు : " మూడు వేలు. కానీ ఈ పుస్తకం చదివే
ధైర్యం నీకు ఉన్నట్లు కనబడటం లేదు. నీకు నేను ఈ పుస్తకం అమ్మను.
యువకుడు : నాకు చాలా ధైర్యం. ఆ పుస్తకం గంటలో చదివేస్తాను.
ముసలివాడు : అయితే. నేను నీకు ఈ పుస్తకం ఒక షరతు మీద అమ్ముతాను.
ఒక వంద డిస్కౌంట్ కూడా ఇస్తాను.
యువకుడు : ఏమిటా షరతు?
ముసలివాడు : నువ్వు జన్మలో లాస్ట్ పేజ్ చదవనని ఒట్టు వెయ్యాలి.
ఎందుకంటే అది చదివి నువ్వు తట్టుకోలేవు.
లెక్కలేనన్ని సమస్యలు వచ్చి పడతాయి.
చచ్చిపొవాలనిపిస్తుంది
యువకుడు : ఒకే! ఒట్టు చివరి పేజీ
చదవనులే. ఇదిగో డిస్కౌంట్ పోను 2900 పుస్తకం ఇయ్యి.
ముసలివాడు పుస్తకం ఇచ్చి ఒట్టు గురించి మళ్ళీ జ్ఞాపకం చేశాడు.
అలాగేనని పుస్తకం ఇంటికి వెళ్ళి భయం భయంగా
మొత్తం గబగబా చదివేశాడు. చివరి పేజీ
వచ్చేసరికి "ఒట్టు" జ్ఞాపకం వచ్చి ఆ పేజీ
తిప్పలేదు. ఓ వారం రోజులు అతి కష్టం మీద
ఓపిక పట్టాడు. ఇక తట్టుకోలేక పుస్తకం చివరి పేజీ తెరచి చూశాడు.
వెంటనే మూర్చపోయాడు.
.
ఆ పేజీలో
రిటైల్ ధర : రూ.30/ మాత్రమే అని వుంది.