కొబ్బరి పాలతో...కొర్రల అన్నం
కావల్సినవి: వండిన కొర్రల అన్నం - పది కప్పులు, నూనె, నెయ్యి - పావు కప్పు చొప్పున, లవంగాలు - మూడు, దాల్చినచెక్క - అంగుళం చొప్పున మూడు ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు - ముప్పావు కప్పు, క్యారెట్ ముక్కలు - అరకప్పు, పచ్చిబఠాణీ - కప్పు, పచ్చిమిర్చి - ఐదు, ఉప్పు - తగినంత, కొబ్బరిపాలు - రెండున్నర కప్పులు, అల్లంవెల్లుల్లి ముద్ద - అరచెంచా.
తయారీ: బాణలిలో నెయ్యి, నూనె వేసి పొయ్యిమీద పెట్టాలి. అవి వేడయ్యాక లవంగాలూ, దాల్చినచెక్క ముక్కలూ వేయాలి. నిమిషం తరవాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలూ, పావుచెంచా ఉప్పూ వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయముక్కలు వేగాక అల్లంవెల్లుల్లి ముద్ద చేర్చి వేయించాలి. అందులో పచ్చిబఠాణీ, క్యారెట్ ముక్కలు వేసి మంట తగ్గిస్తే.. కాసేపటికి అవి మగ్గుతాయి. అప్పుడు కొబ్బరిపాలూ, మరికొంచెం ఉప్పూ వేసి మంట తగ్గించాలి. ఒక్క పొంగు వచ్చాక ముందుగా వండి పెట్టుకున్న కొర్ర అన్నం వేసి మూత పెట్టేయాలి. ఒకటిన్నర నుంచి రెండు నిమిషాలయ్యాక దింపేస్తే చాలు. అయితే మూడు నిమిషాల తరవాత మూత తీసి వడ్డించాలి.