ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

ROYYALA KABAB RECIPE - PRAWNS TELUGU RECIPES COLLECTION


రొయ్య కబాబ్‌

కావలసిన పదార్థాలు: 
పెద్ద రొయ్యలు - అరకేజి. మొదటిసారి కలపడానికి: ఉల్లిపాయ గుజ్జు -150 గ్రా., పసుపు - 1 టీ స్పూను, చింతపండు గుజ్జు- 50 గ్రా., ఉప్పు- కొంచెం. రెండోసారి కలపడానికి: ధనియాల పొడి - 100 గ్రా., జీలకర్ర పొడి - 75 గ్రా., మిరియాల పొడి - 50 గ్రా., కారం - 50 గ్రా., కొబ్బరి తురుము - 50 గ్రా., నెయ్యి - 1 టేబుల్‌ స్పూను. 
మూడోసారి కలపడానికి: ఉల్లిపాయ గుజ్జు - 100 గ్రా., చింతపండు గుజ్జు - 100 గ్రా., కారం - 1 టేబుల్‌ స్పూను.

తయారుచేసే విధానం:
రొయ్యల్ని శుభ్రం చేశాక మొదటిసారి పదార్థాలన్నీ కలిపి అందులోనే రొయ్యల్ని వేసి 2 గంటలపాటు ఉంచాలి. తర్వాత రొయ్యల్ని కడిగి పెట్టుకోవాలి. రెండోసారి కలిపే పదార్థాలను నేతిలో వేగించి అందులోనే మూడోసారి కలిపే పదార్థాలను కూడా వేసి చిక్కని పేస్టులా తయారుచేసుకోవాలి. రొయ్యల్ని ఈ పేస్టులో 3 గంటలపాటు నానబెట్టి తీసి సన్నని ఊసలకు గుచ్చి బొగ్గులపై దోరగా కాల్చుకోవాలి. బొగ్గులు దొరకని పక్షంలో గ్యాస్‌ స్టౌవ్‌పైన కూడా కాల్చుకోవచ్చు. వీటిని అన్నంతో పాటు నంజుకుంటే చాలా రుచిగా ఉంటాయి.