ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

MADHURA MEENAKSHI TEMPLE


మధుర మధుర మీనాక్షి !
.
కోరిన కోర్కెలు తీర్చే మధుర మీనాక్షి అమ్మవారు 
మధురమధుర-మధుర మధుర మీనాక్షి 
ఇదిగొ యిదిగొ కళ్ళ యెదుట మీనాక్షి 
మీనువంటి కన్నులున్న మీనాక్షి
మేనంత కన్నుగా గల సాక్షి
మీనులా మనవంక చూసి చూసి పోషించు
నానంద రసము పోసి మా అమ్మ వచ్చెను –
.
దేశవ్యాప్తంగా ఉన్న అతి పవిత్ర, పురాతన దేవాలయాల్లో మధుర మీనాక్షి ఆలయం ఒకటి. ఈ దేవాలయం తమిళనాడు రాష్ట్రంలోని రెండో అతి పెద్ద నగరమైన మదురైలో వెలసి ఉంది. సుమారు 2500 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ దేవాలయం పాండ్య రాజుల కాలం నుంచే పూజలందుకుంది. ఈ ఆలయానికి నాలుగు ముఖ ద్వారాలు ఉన్నాయి. ధర్మ, అర్ధ, కామ, మోక్ష ద్వారాలుగా వీటిని పిలుస్తారని పురాణ గాథలు చెప్పబడింది. ఎత్తైన ఈ ఆలయ గోపుర శిఖరాలు నగరానికి గుర్తింపుగా నిలిచాయి. హిందువులు పవిత్రంగా పూజించే ఈ ఆలయానికి వేలాది మంది భక్తులు నిత్యం మీనాక్షి అమ్మవారిని దర్శించుకుని వెళుతుంటారు. ఈ ఆలయంలో పార్వతీ దేవి కొలువై ఉన్న ప్రాంతానికి పురుషులకు ప్రవేశం లేదు.