ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

HEALTH BENEFITS WITH JEEDI PAPPU


జీడిపప్పు

జీడిపప్పు లేని పాయసాన్ని ఊహించుకోవడమే చాలా మందికి కష్టం. కలవారింట కమ్మని వంటలలో చేరిపోయే జీడిపప్పు వంట రుచి చూడకపోతే సర్వం కోల్పోయినట్టుగా ఇంకొంతమంది ముఖాలు మాడ్చుకుంటారు. వంటలలో ఈ దినుసు పడిందంటే కాస్త కాస్ట్లీవారన్న అభిప్రాయానికి చేరువచేస్తుంది ఈ దినుసు. తెలుగు వారిచేత కాజు, జీడిపప్పుగా పిలుచుకునే క్యాషోనట్ అనకార్డియేసి కుటుంబానికి చెందినది. బహుశా మన గుండెకు, గుండె పై భాగానికి శక్తి తెచ్చే గుణాలు మెండుగా ఉండటం వల్ల దీనికి ఆ పేరు పెట్టి ఉంటారు.

గుండె బలానికి, కండ బలానికి మేలైనదిగా ఎంచుకుని ఇష్టంగా తినే జీడిపప్పు భారతదేశంలోనూ విరివిగానే పండుతోంది. కాని దీని నేటివ్ ప్లేస్ మాత్రం ఉత్తర దక్షిణ అమెరికాలుగా చెబుతున్నారు. పోర్చుగీసు వారు భారత దేశంలో అడుగుపెట్టి, వ్యాపారాలు చేసుకునే రోజుల్లో ఈ దినుసును మనకు పరిచయం చేశారని చరిత్ర చెబుతోంది. అయితే పచ్చివి కాకుండా వేయించిన జీడిపప్పును పరిచయం చేశారట. వారి ద్వారా ఈ మొక్క మన దేశంలో ముందుగా గోవాలో అడుగుపెట్టి, ఆ తర్వాత దక్షిణ తూర్పు ఆసియా, ఆఫ్రికాలోనూ వ్యాపించిందని చెబతుంటారు. ఆ తర్వాత ప్రపంచంలో వాతావరణ పరిస్థితులు ఎక్కడ అనువుగా ఉంటే అక్కడే జీడిచెట్లు వేళ్లూనుకుపోయాయి.

ఎత్తు తక్కువైనా తనలో విశాలత్వం ఎక్కువ అని చెప్పడానికేమో ఈ చెట్టు బహుసుందరంగా ఉంటుంది. ప్రతి పువ్వు లేత ఆకుపచ్చలో ఉండి, క్రమంగా ఎరుపు, పసుపు రంగులోకి మారుతుంది.

ప్రకృతిలో జీడిపండు ఒక అద్భుత సృష్టి అని చెప్పుకోవచ్చు. అన్ని పండ్లకి గింజ లోపల ఉంటే, దీంట్లో అది బయటకే కనపడుతుంది. ఇసుక నేలల్లో విరివిగా పండే జీడిపళ్లు వేసవిలో వస్తాయి. ఈ పండ్లను తింటే వగరుగా ఉంటాయి. ఈ జీడిరసం బట్టల మీద పడితే మాత్రం ఆ మరక ఎన్ని డిటెర్జెంట్లు రాసినా వదలదు. చర్మం మీద పడినా కొంచెం ప్రమాదమే అంటారు. అందుకే వీటితో కాస్త జాగ్రత్తగా ఉండటమే మేలు. పచ్చిగానూ, వేయించి తినే జీడిపప్పులో ఉండే అనకార్డిక్ ఆమ్లాలు దంత సమస్యలను తగ్గిస్తాయట. వీటిని రాత్రిపూట నానబెట్టి, ఉదయం తినడం వల్ల అతిసార వల్ల కలిగే విరేచనాలు తగ్గుతాయి. ఈ జీడిపప్పు ఆయిల్‌ను యాంటీ ఫంగల్ సమస్యలకు విరుగుడుగా, కాలిపగుళ్లకు మందు గానూ ఉపయోగిస్తారు.

జీడి పిక్కలను జీడిపప్పుగా తయారు చేసే పరిశ్రమలు మన రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లా పలాస, తూర్పుగోదావరిలోని మోరి గ్రామాలలో ఉన్నాయి. ఈ పరిశ్రమల మీద ఆధారపడి అనేక కుటుంబాలు ఉపాధి పొంతున్నాయి. ఈ జీడిపప్పు ఎగుమతి ద్వారా భారత దేశానికి విలువైన విదేశీ మారక ద్రవ్యమూ లభిస్తుంది.