ముల్లంగిని చాలా మంది ఆహారానికి దూరంగా పెట్టేస్తారు. దాని గురించి సరైన అవగాహన లేకపోవడమే అందుకు కారణం. కానీ వాస్తవానికి ముల్లంగిలో మేలు చేసే ఔషధ గుణాలెన్నో పుష్కలంగా ఉన్నాయి. దీన్ని మన రోజువారీ ఆహారంలో భాగం చేసుకుంటే చక్కని ఆరోగ్యం మీ సొంతమవుతుంది.
జాండిస్: ముల్లంగి లివర్ పాలిట వరప్రదాయని. హానికారక విషతుల్యాలను బయటకు పంపించండంలో ముల్లంగి పాత్ర అమోఘం. అలాగే కడుపును కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. కామెర్లు వచ్చిన వారు ముల్లంగి రసాన్ని తీసుకుంటే త్వరగా తగ్గిపోతుంది. అంతేకాదు కామెర్ల సమయంలో ఎర్రరక్తకణాలు తగ్గిపోకుండా కాపాడడంతోపాటు రక్తానికి ఆక్సిజన్ సక్రమంగా జరిగేట్లు చూస్తుంది. కామెర్ల సమయంలో నల్లముల్లంగి తీసుకుంటే చాలా మంచిది. వీటి ఆకులు కూడా కామెర్ల చికిత్సలో మంచిగా పనిచేస్తాయి.
పైల్స్: జీర్ణశక్తిని వృద్ధి చేసి దేహంలో నీరు నిలిచేలా చేస్తుంది. అలాగే పైల్స్ తొందరగా తగ్గిపోయేట్లు తోడ్పడుతుంది
పురుగుకాటు: ముల్లంగి తేనెటీగ, పురుగు కాట్లలో వచ్చే నొప్పి, వాపుని తగ్గించడానికి సహాయపడుతుంది. జ్వరం: జ్వరం కారణంగా వచ్చే నొప్పులను, శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. ముల్లంగి రసంలో నల్లఉప్పును కలుపుకుని తాగితే ఇన్ఫెక్షన్లను తీసివేస్తుంది. దాంతో జ్వరం నెమ్మదిస్తుంది.
వీటితోపాటు ముల్లంగి ఆకలిని వృద్ధి చేస్తుంది. అలాగే నోటిశ్వాసను తాజాగా ఉంచుతుంది. రక్తసరఫరాను మెరుగుపరుస్తుంది. కడుపులో మంట, తలనొప్పి, దగ్గుని తగ్గిస్తుంది.