ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

POWERBANK 2 LAPTOPS


ఇక నుంచి ల్యాపీల‌కూ.. ప‌వ‌ర్ బ్యాంక్‌

ప‌వ‌ర్ బ్యాంకుల వాడ‌కం కేవ‌లం ఫోన్ వ‌ర‌కు మాత్రం ప‌రిమ‌తం కాకుండా.. ఇప్ప‌డు ల్యాపీల కోసం కూడా ప‌వ‌ర్ బ్యాంక్ మార్కెట్‌లోకి తీసుకువ‌స్తున్నారు. క్యాన్ఎక్స్ సంస్థ‌వారు ఈ ప‌వ‌ర్ బ్యాంక్‌ని మార్కెట్‌లోకి తీసుకువ‌స్తున్నారు. మార్కెట్ లో ప్ర‌స్తుతం దొరుకున్న ప‌వ‌ర్‌బ్యాంకుల సామ‌ర్య్ధం 5 నుంచి 6 యంఏహెచ్ వ‌ర‌కు ఉంటుంది. అదే ప‌రిమాణంలో ఉండే క్యాన్ఎక్స్ ప‌వ‌ర్ బ్యాంక్ కెపాటసిటీ మాత్రం ఏకంగా 23,000 యంఎహెచ్‌. కేవ‌లం రెండు గంట‌లు ఛార్జింగ్ పెడితే చాలు ఇది ఫుల్ అవుతుంది. ఒక్క ప‌వ‌ర్ బ్యాంక్‌తో ఏకంగా రెండు ల్యాప్‌టాప్‌లు,10 ఫోన్లు, నాలుగు ట్యాబ్లెట్ల బ్యాట‌రీల‌ను ఫుల్ చేయ‌వ‌చ్చు. దీని బ‌రువు కూడా చాలా త‌క్క‌వ‌, దీన్నీ జేబులో పెట్టుకుని ఎక్క‌డికైనా తీసుకెళ్ల‌వ‌చ్చు. కేవ‌లం ఫోన్ల‌కే కాకుండా ల్యాప్‌టాప్‌ల‌కు క‌నెక్ట్ చేసుకునేందుకు దీనికి యూఎస్‌బీ తో పాటు.. హైస్పీడ్‌ యూఎస్‌బీ-సీ పోర్టు ఉంది. అలాగే ల్యాప్‌టాప్‌ ఛార్జర్‌తో కనెక్ట్‌ చేసేందుకు 110వోల్టుల అడాప్టర్‌ కూడా ఉంది. ఈ ప‌వ‌ర్ బ్యాంక్ నుంచి ఒకేసారి మూడు డివైజ్‌ల‌కు ఛార్జింగ్ పెట్టుకోవ‌చ్చు.