ఉలవలు
మూత్రంలో చురుకు, మంట:
ఒక కప్పు ఉలవచారుకి సమాన భాగం కొబ్బరి నీరు కలిపి తీసుకుంటుంటే మూత్రంలో మంట తగ్గుతుంది. మూత్రం జారీ అవుతుంది. మధుమేహం: మూత్రంలో చక్కెర కనిపిస్తున్నప్పుడు ఉలవల కషాయంలో వెంపరి (శరపుంఖ) చెట్టు చూర్ణాన్ని, సైంధవ లవణాన్ని కలిపి తీసుకుంటే లాభదాయకంగా ఉంటుంది. సెగగడ్డలు: ఉలవ ఆకులను మెత్తగా నూరి, కొద్దిగా పసుపుపొడి కలిపి పై పూత మందుగా రాస్తే చర్మంమీద తయారైన సెగ గడ్డలు పగిలి, నొప్పి, అసౌకర్యం తగ్గుతాయి. విరేచనాలు: ఒక టీ స్పూన్ ఉలవ ఆకురసానికి అరటి పండు కలిపి రోజుకు 2-3 పర్యాయాలు తీసుకుంటే విరేచనాలు నియంత్రణలోకి వస్తాయి. చర్మంమీద తయారయ్యే వాపు, నొప్పి, దురదలు: మొలలమీద ఉలవల ముద్దను లేపనం చేస్తే నొప్పి, వాపు, దురదలు తగ్గుతాయి. ముఖ చర్మం కాంతి లేకుండా తయారవటం: ఉలవల పిండిని ఫేస్ ప్యాక్‌గా ప్రయోగిస్తే చెక్కిలి, బుగ్గలు కాంతితో మెరుస్తాయి. తెల్లబట్ట (వైట్ డిశ్చార్జ్): ఉలవచెట్టు కట్టెతో తయారుచేసిన కషాయం తీసుకుంటే మహిళల్లో కనిపించే తెల్లబట్ట సమస్య తగ్గుతుంది. ప్రసవం పూర్తిగా జరగకపోతే : ప్రసవానంతరం గర్భశయంలో మిగిలిపోయిన మైల సంబంధ రక్తం నిశే్సషంగా వెలుపలకు రావడానికి ఉలవలు సహకరిస్తాయి. ఆయుర్వేద గ్రంథాలు చెప్పిన చికిత్సలు జ్వరం: జ్వరంతో ఇబ్బంది పడుతున్నప్పుడు ఉలవలతో కషాయం తయారుచేసుకొని పెసర కట్టుకు కలిపి తీసుకోవాలి. ఉలవల వల్ల చెమట పట్టి జ్వరం దిగుతుంది. పెసర కట్టు తేలికగా జీర్ణమై శక్తిని ఇస్తుంది. ఎక్కువగా చెమట పట్టడం (స్వేదాదిక్యత): ఉలవలను కొద్దిగా వేయించి, పొడిచేసి చర్మంమీద రుద్దుకోవాలి. దీనిని నలుగు పిండిగా గాని లేదా స్నాన చూర్ణంగా గాని వాడుకోవచ్చు. దగ్గు, ఆయాసం: ఉలవల కషాయం తీసుకుంటే దగ్గు, ఉబ్బసంలో హితకరంగా ఉంటుంది.
గుండె జబ్బులు:
బార్లీగింజలతో అన్నం మాదిరిగా వండుకొని ఉలవ కషాయం కలిపి తీసుకుంటే గుండె జబ్బుల్లో హితకరంగా ఉంటుంది. మూత్ర పిండాల్లో రాళ్లు: ఉలవలతో ఘృతపాక విధానంలో ఘృతం తయారుచేసుకొని తీసుకోవాలి. దీనిని కులత్యాదిఘృతం అంటారు. ఉలవల ముద్దకు నాలుగురెట్లు నెయ్యిని, నెయ్యికి నాలుగురెట్లు నీళ్లనూ కలిపి, చిన్న మంట మీద నీరంతా ఆవిరయ్యేవరకూ మరిగించడాన్ని ఘృత పాక విధానం అంటారు. కడుపునొప్పి: ఉలవ కషాయాన్ని సక్రమమైన రీతిలో పులియబెట్టి, సైంధవ లవణం, మిరియాల పొడిని కలిపి తీసుకుంటే కడుపునొప్పిలో హితకరంగా ఉంటుంది. ఆహారం తీసుకున్న తరువాత కడుపునొప్పి వస్తుంటే (అన్నద్రవశూల): ఉలవలు వేయించి, పొడిచేసి వెన్న లేని పాలతో తోడుపెట్టి చేసిన పెరుగుతో కలిపి తీసుకుంటే అన్నద్రవ శూలనుంచి ఉపశమనం లభిస్తుంది. నులిపురుగులు, అంత్రక్రిములు: పాలకు ఉలవ కషాయం చేర్చి తీసుకుంటే అంత్రక్రిములు నశిస్తాయి. దద్దుర్లు (శీతపిత్తం) (అర్టికేరియా): ఉలవలు, ర్యాడిష్ దుంపల పొడి వంటివి ఆహారంలో తీసుకుంటే దద్దుర్లనుంచి ఉపశమనం లభిస్తుంది. ఆమవాతం (రుమటాయిడ్ ఆర్తరైటిస్): ఉలవలతో సూప్ తయారుచేసుకొని తీసుకుంటే వాపులతో కూడిన కీళ్లనొప్పిలో హితకరంగా ఉంటుంది. గండమాల (సర్వైకల్ లింఫ్ ఎడినైటిస్): తేమ లేని ఆహారానికి ఉలవల కషాయం చేర్చి తీసుకుంటే గండమాలలో హితకరంగా ఉంటుంది. నష్టార్తవం (బహిష్టు సక్రమంగా రాకపోవటం, బహిష్టు ఆగిపోవటం) (ఎమనోరియా): ఉలవలు, చేపలు, పుల్లని మజ్జిగ, పుల్లని కషాయాలు, నువ్వులు, మినుములు, ద్రాక్షతో తయారైన వైన్ వంటివి తీసుకుంటే బహిష్టు రక్తం అడ్డులేకుండా సజావుగా స్రవిస్తుంది.
అర్శమొలలు:
ద్రవ రూప మలంతోపాటు అర్శమొలలు ఇబ్బంది పెడుతున్నప్పుడు ఎండించిన ముల్లంగి దుంపల పొడిని, ఉలవ పొడినీ కలిపి తీసుకోవాలి. వెలగపండు, మారేడు పండ్లు, చెంగల్వకోష్టు వీటితో కషాయం తయారుచేసుకొని మేక మాంసంతో కలిపి తీసుకోవాలి. కఫంవల్ల ఎక్కిళ్లు, ఉబ్బసం వస్తుంటే: ఉలవ కషాయాన్ని, పంచకోలాల కషాయాన్ని నెయ్యికి చేర్చి ఘృత పాకం విధానంలో నెయ్యిని తయారుచేసుకొని తీసుకుంటే ఎక్కిళ్లు, ఉబ్బసం తగ్గుతాయి. శరీరంలో పెరుగుదలలు తయారవటం (గుల్మం): ఉదర భాగంలో ట్యూమర్లు పెరుగుతున్నప్పుడు ఉలవలు, పెసర గింజలు, పిప్పళ్లు, శంఠి కొమ్ములు, ముల్లంగి, మారేడుపండ్లు, ఉలిమిరిపట్ట, చిరబిల్వ లేతాకులు, చిత్రమూలం వేరు, వాము... వీటిని నీళ్లకు కలిపి కషాయం తయారుచేసుకొని తీసుకోవాలి.