బామ్మ గారా మజాకా!
ఒక చిన్న టౌన్ లో వున్న కోర్ట్ లో ,ఒక కేసు విచారణ సందర్భంగా ఒక బామ్మ గారిని సాక్షిగా పిలిచి బోనెక్కించారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు ఆవిడ దగ్గరికి వెళ్ళి , " మామ్మ గారు నేనెవరో మీకు తెలుసా ?" అని అడిగాడు దర్పంగా నల్ల కోటు సర్దుకుంటూ...
ఆవిడ వెంటనే ," అయ్యో ,తెలియక పోవడమేంటీ..?బాగా తెలుసును..పెద్దపిచ్చయ్యగరి రెండో అబ్బాయి గోవిందానివి కదూ..నీ చిన్నప్పటి నుండీ నిన్నూ . మీ కుటుంబాన్నీ ఎరుగుదును నాయనా..! నిజంచెప్పాలంటే
,చిన్నప్పుడు నిన్ను ఎందుకూ పనికిరావు అనుకునేదాన్ని . అబధ్ధాలాడేవాడివి,
జనాన్ని మోసం చేసేవాడివి ,ఆఖరుకి నీ భార్యని కూడా మోసం చేసావ్ ..పైసాకా పనికిరాకపోయినా , గొప్పలు పోయేవాడివి .నాకు బాగా తెలుసు ను కదా !"
అంది.
P.P. గారు హడిలి పోయి ,బిక్క చచ్చి పోయారు. ఏం మాట్లాడాలో తెలియక , డిఫెన్సు లాయరు గారిని చూపించి , " వారు తెలుసా ..? "అని అడిగాడు.
బామ్మగారు ఠక్కున , "మాబాగా తెలుసును..జేబులు కత్తిరించే వీరదాసు కొడుకు
కుమారదాసు కదా .. చిన్నప్పుడు పనీ పాటాలేకుండా వీధులెంట బలాదూర్ తిరిగేవాడు.లేని దురలవాటులేదు..తాగుబోతు, తిరుగుబోతు కూడానూ !ఇతనిది
అందరి కంటే చెత్త ప్రాక్టీసు అని ఊరంతా చెప్పుకుంటారు. పైగా ముగ్గురు స్త్రీలతో అక్రమ సంబంధం ..అందులోఒకరు మీ ఆవిడే కదా ! నాకు తెలీకేం , బాగా
తెలుసు ..." అంది గుక్క తిప్పుకోకుండా .
డిఫెన్స్ గారికి చచ్చినంత పనైంది .
జడ్జి గారు ఇద్దరు లాయర్లని తన దగ్గరికి పిలిచి ,రహస్యంగా , "మీ ఇద్దర్లో ఎవరైనా
తెలివి తక్కువగా , జడ్జి గారు తెలుసా అని ఆవిడని అడిగారంటే ,కోర్టు ధిక్కారం కేసు
కింద జైల్లో తోయించేస్తా ,జాగ్రత్త !!"అని బెదిరించాడు.
లాయర్లు షాక్ !! బామ్మ రాక్స్ !!