పుచ్చకాయ : మనిషికి కావాల్సిన ఖనిజాలు, ఇతర పోషకాలు.. ఒక గ్లాసుడు పుచ్చకాయ రసం తాగితే అందుతాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. డీహైడ్రేషన్ సమస్య దరిచేరకుండా కాపాడుతుంది. శరీరంలో ఉన్న వ్యర్థ పదార్థాలనూ బయటకు పంపుతుంది.
టమాటా జ్యూస్: టమాటా జ్యూస్‌లో శరీరంలోని కొవ్వుని తగ్గించే గుణం ఎక్కువగా ఉంటుంది. సన్నబడాలి అనుకుంటే ఉదయాన్నే ఈ జ్యూస్ తాగితే మంచి ఫలితం కనిపిస్తుంది. ఇందులో పొటాషియం, విటమిన్ సి ఉండటం వల్ల చర్మం నిగారింపుని సంతరించుకుంటుంది.
కాకరకాయ : కాకర అనగానే ముందుగా గుర్తుకొచ్చేది చేదు. ఈ పేరు వినగానే ఆమడదూరం పరిగెడతారు కూడా చాలా మంది. కానీ ఇది శరీరానికి చేసే మేలు ఎంతో. ఇందులో షుగర్ ఉండదు కాబట్టి మధుమేహ రోగులకు ఈ జ్యూస్ ఎంతో మంచిది.
క్యారెట్ : విటమిన్ ‘ఎ’ సమృద్ధిగా ఉండే కూరగాయ ఇది. చర్మ సమస్యలు, కళ్ల సమస్యలు ఉన్నవాళ్లు క్యారెట్ జ్యూస్ తాగితే ఉపశమనం కలుగుతుంది. రోజూ ఒక గ్లాస్ క్యారెట్ జ్యూస్ తాగితే చాలు… చర్మం మిలమిల మెరిసిపోతుంది.
పాలకూర జ్యూస్ : పాలకూర ఎండాకాలంలో మనకి చాలా మేలు చేస్తుంది. ఐరన్ ఎక్కువగా ఉండే ఈ పాలకూర తినటం వల్ల ఎర్ర రక్త కణాలు త్వరగా అభివృద్ధి చెందుతాయి. ఈ పాలకూర జ్యూస్ వాసన నచ్చక తాగలేని వాళ్ళు ఇందులో ఒక కేరట్, కొద్దిగా నిమ్మరసం కలుపుకుని తాగచ్చు.