ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

JAPA VIDHANALU - TYPES OF USAGE OF JAPAMALA


జప విధానాలు

భగవంతునిపై మనసు నిల్పి బయటి విషయాలేవీ లోనికి దూరకుండా ఏకాగ్రతగా భగవ న్నామాన్ని ఉచ్చరించే ప్రయత్నమే జపం అనికూడా అనవచ్చు . ఒకే నామాన్ని పదే పదే ఉచ్చరించటమే జపం . ఒకే నామాన్ని జపించడం వల్ల ఆదైవరూపం మనస్సులో నిల్పే అవకాశం లభ్యమవు తుంది.

గాఢమైన భక్తితో , సమాహిత చిత్తంతో భగవదంశకు ప్రతీకగావున్న మంత్రాన్నిగానీ , ఇష్టదైవం యొక్క నామా న్నికానీ సదామనస్సులో విడువక స్మరించడమే’ జపము’ . భగవన్నామాలూ, మత్రాలు మహాశక్తి వంతాలు.అవి మానవులలోని దివ్యశక్తిని మేల్కొలిపి , మనస్సులను పవిత్ర పరచే మహిమగలవి. ' జ ' కారో జనం వినాశనం ' ప ' కారో పాప నాశనం . జప పదములోని జకారము చావు పుట్టుకలను నశింప జేస్తుంది . పకారము పాపములను పరిహారం చేస్తుంది .జపానికి అంత మహిమ ఉంది. జపం చేయను కొందరు వారి గురువుల వద్ద మంత్రోపదేశం పొందుతారు. మరికొందరు వారిం ఇష్టదైవనామాన్నికానీ , విశ్వాసమున్న మంత్రా న్నిగానీ నిరంతరం జపిస్తూ ఉంటారు. చాలామంది మంత్రరాజమైన గాయత్రీ మంత్రాన్ని నిరంతరం జపించ డం జరుగు తుంటుంది. మరికొందరు ప్రతినిత్యం ఒక నిర్ధిష్ట సమయంలో మంత్రాన్ని 108 మార్లు జపించడమూ జరుగు తుంటుంది.

ఎనిమిది వత్సరాల బాలుడైన ధృవుడు నారద మహర్షి బోధించిన " ఓం నమో భగవతే వాసుదేవాయ " అనే మంత్రాన్ని జపించి , సాక్షాత్ పరమాత్మ ఐన మహావిష్ణువును దర్శించాడు . బాల ప్రహ్లాదుడు " ఓం నమో నారాయ ణాయ " అనే మత్రాన్ని జపించి విష్ణువును తన అంగరక్షకునిగా చేసుకున్నాడు . ఇహ మృకండు మహర్షి కుమారు డైన మార్కండేయుడు " ఓం నమశ్శి వాయ " అనే శివనామాన్నిజపించి మృత్యుదేవత ఐన యమునే ఎదిరించి చిరాయువైనాడు . ఇలా మంత్ర జప మహిమ చెప్పుకుంటూ పోతే చాలా ఉంటుంది.

అనేక మంది అనేక విధాలుగా జపాన్ని వారికి వీలైన విధానంలో ఎంచు కుంటుంటారు. ఐతే వివిధ జాతుల, మతాల, దేశాల వారు వారి వారి ఆచారాల ప్రకారం జపానికి పధ్ధతులను నిర్ణయించు కుంటారు. మరి జపవిధా నాలను ఒకమారు వీక్షిద్దాం. హిందూ సాంప్రదాయంలో జపానికీ, జపమా లకూ చాలా ప్రాముఖ్యత ఉంది. జపం అంటే వారి వారి ఇష్ట దైవాల నామాలను పలుకుతుండటం అనుకున్నాం కదా! . ''ఓం నమశ్శివాయ'' , “ ఓం నమోనారాయణాయ”, "ఓం నమో భగవతే వాసుదేవాయ” , ‘ఓం శ్రీ సాయిరాం“ ఇలా వారికి ఇష్టమైన నామాన్ని ఉచ్చరించడం . భగవంతునిపై మనసు నిల్పి బయటి విషయాలేవీ లోనికి దూరకుండా ఏకాగ్రతగా భగవ న్నామాన్ని ఉచ్చరించే ప్రయత్నమే జపం అనికూడా అనవచ్చు . ఒకే నామాన్ని పదే పదే ఉచ్చరించటమే జపం . ఒకే నామాన్ని జపించడం వల్ల ఆదైవరూపం మనస్సులో నిల్పే అవకాశం లభ్యమవు తుంది.

ఒక మంత్రాన్నికానీ శ్లోకాన్ని కానీ వేలి కణుపులతో లేదా జపమాల తో గణిస్తూ అను కున్న సంఖ్య పూర్తి చేయ డం ఒక జప విధానం. దేవుడి నామస్మరణ చేస్తూ , గుడి చుట్టూ 108 ప్రదక్షిణలు చేస్తూ సంఖ్యకోసం జపమా లను ఉపయోగిస్తాం. పూజల్లో జపమాలకు చాలా ప్రాముఖ్యత ఉంది. సాధారణంగా జపమాలలో 108 పూసలు ఉంటాయి. బౌద్ధుల జపమాలలోనూ 108 పూసలు, జపాన్ దేశస్తుల జపమాలలో 112 పూసలు, జైనుల జపమాలలో 111ముత్యాలుంటాయి. బర్మా, భారత దేశాల్లో 108 పూసల జపమాలనే ఉపయోగిస్తారు. ఆధ్యాత్మిక చింతనలో ఈ సంఖ్యని పరమ పవిత్రమైంది గా భావిస్తారు . జపాన్లోచనిపోయిన వారి కర్మకాండలు జరిపించేప్పుడు 108 దీపాలను వెలిగిచి,108 రూపాయలు దానంచేస్తారు. బర్మాలోని బుద్ధుని పాద చిహ్నంలో 108 భాగాలున్నాయి. టిబెట్టు బౌద్ధుల 'కహగ్పూర్'లో 108 పంక్తులతో లిఖించి ఉంటుంది. పెకింగ్ లో ప్రకాశ వంతంగా కనిపిచే చైనీస్ వైట్ హౌజ్ లో 108 స్తంభాలు ఉన్నాయి.

కొందరు 108 ధాన్యపు గింజలను ఒక చిన్న పాత్రలోఉంచి, మరో చిన్న ఖాళీ పాత్రను ఇంకో చేతిలో ఉంచుకుని ఒక్కో మంత్ర జపం పూర్తికాగానే ,లేదా ఒక్కో ప్రదక్షిణ పూరికాగానే ఒక్కోగింజను రెండో పాత్రలో వేస్తారు. అలా మంత్రాలు, లేదా ప్రదక్షిణలు పూర్తిచేస్తారు. కానీ వీటికంటే జపమాల సాయంతోమంత్రోచ్చారణ లేదా ప్రదక్షిణలు చేయడం సులభం కానీ ఎంపిక వారి వీలును అవకాశాన్ని బట్టి నిర్ణ యించు కోడం జరుగుతుంటుంది.