సూక్తులు
🔻విద్యను ఆర్జించడం కంటే కూడా అజ్ఞానాన్ని కప్పిపుచ్చుకోవడం చాలా కష్టం
🔻విద్యను పొందడం సులభమే కాని వివేకం పొందడం కష్టతరమైన కార్యం.
🔻విద్యాధికుడై, తన పాండిత్యాన్ని ఉపయోగించుకోని మనిషి - పుస్తకాల బరువు మోసే మృగం.
🔻విధేయత మాత్రమే ఆజ్ఞాపించే హక్కు ఇస్తుంది.
🔻వినయం గొప్పతనాన్ని ప్రకటిస్తుంది.
🔻వినయం నీవు ధరించే విలువైన వజ్రం.
🔻వినయం ప్రతిష్ఠకు సులభ మార్గం.
🔻విమర్శలను చూసి భయపడకూడదు.
🔻గాలిపటం ఎప్పుడూ ఎదురు గాలిలోనే పైకి లేస్తుంది.విరగడం కంటే వంగడం మంచిది.
🔻వివేకవంతులతో సాహచర్యం నిన్నుకూడా వివేకవంతుణ్ణి చేస్తుంది - మినాండర్.
🔻వివేకవంతులైన వారెప్పుడూ గతంలో కాకుండా వర్తమానంలో జీవిస్తారు.
🔻వివేకానికి మొదటి అడుగు ఏది అసత్యమో తెలుసుకోవడమే.
🔻వివేకాన్ని పాటించే చోట శాంతి పుష్కలంగా లభిస్తుంది.విశ్వాసం పరమ బంధువు.విశ్వాసం వ్యక్తిత్వాన్ని వైభవోజ్వలం చేస్తుంది.
🔻విశ్వాసం, అఖండ విశ్వాసం, మనమీద మనకే విశ్వాసం, దేవుడి మీద కూడా అంతే విశ్వాసం. ఇవే గొప్పతనంలోని రహస్యాలు.
🔻విషయం సమగ్రంగా తెల్సుకోకుండానే తృణీకరించకండి. నిర్ణయించకండి.
🔻విస్తరించడం జీవితం అవుతుంది, ముడుచుకుని పోవడం మరణం అవుతుంది.
🔻వెంట వచ్చేది సంసారం కాదు, సంస్కారం.
🔻వెయ్యి మంది మిత్రులున్న వ్యక్తి ఒక్కరిని కూడా వదులుకోలేడు. ఒకే ఒక శత్రువున్న వ్యక్తి అతన్ని ప్రతిచోట కలుస్తాడు.
🔻వెలుతురు వైపు చూడడం నేర్చుకో. ఇక నీకు నీలినీడలు కనిపించవు.
🔻వేగంగా వాగ్ధానం చేసేవారు నిదానంగా నెరవేరుస్తారు.
🔻వేదన అనేది రానున్న కష్టానికి చెల్లించే ముడుపు.
🔻వేదనలకు కుంగిపోక చేతినిండా పని కల్పించుకుంటే ఆనందసుమం దానంతటదే వికసిస్తుంది.
🔻వ్యక్తి శీలం నిర్ణయించేది అతని నడవడిక గానీ, వేషంకాదు.