ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

POETRY BY THE GREAT POTHANA AND ITS MEANING


పోతన గారి పద్యం.! ......బాపు గారి చిత్రం..! 
.
కలయో ! వైష్ణవ మాయయో ?
.

"కలయో ! వైష్ణవ మాయయో ! యితర సంకల్పార్థమో ! సత్యమో
తలపన్నేరక యున్నదాననో ! యశోదాదేవి గానో ! పర
స్థలమో ! బాలకుండెంత ! యీతని ముఖస్థంబై యజాండంబు ప్ర
జ్వలమై యుండుట కేమి హేతువో ! మహాశ్చర్యంబు చింతింపగన్"
.
భాగవతంలో భగవంతుడు యశోదాదేవికి విశ్వరూపాన్ని చూపించిన ఘట్టం . పసిబాలుని నోటిలో సప్త సముద్రాలు , ఎత్తైన కొండలు , మహారణ్యాలు , సూర్య చంద్రులు , భూగోళం , సకల నక్షత్రాలు కనిపించాయి .
బ్రహ్మాండాన్ని కనులతో చూచిన ఆ తల్లికి ఒక్కసారిగా మతిపోయింది .
” ఇది కలా ! నిజమా ! అసలు నేను యశోదా దేవినేనా . ఇది మా యిల్లేనా ? విష్ణుమాయా ? సత్యమేనా ? అసలు నా బుధ్ధి పనిజేస్తోందా ?
చూడడానికి పసి బాలుడు . నోరు తెరిస్తే విశ్వం కనిపిస్తోంది .
ఇంతకంటే వింత ఏదైనా ఉంటుందా ? . అలోచించిన కొలదీ ఆశ్చర్యం వేస్తున్నది . అని ఆమె మనసు పరి పరి విధాల ఆలోచించింది .
నా భ్రమ తొలగడానికి అన్ని లోకాలకూ అధిపతి అయిన ఆ విష్ణుమూర్తినే శరణు కోరుతాను ” అని అనుకొని భగవంతుని శరణు కోరింది మాత . కోరిన మరుక్షణం మాయ కరిగి పోయింది . సర్వాత్ముడు పసిబాలుడుగా కనిపించాడు .
క్షణకాలం కింద తను ఏమి చూసిందో మరిచిపోయింది