పోలీస్ : సాయిలు అంటే నువ్వేనా..?
సాయిలు : నేనే సారు.. ఏం కావాలే సారు..?
పోలీస్ : నయీం డైరీల నీ పేరుంది..
సాయిలు : నా పేరా నాకేం తెల్వదు సారు..
😱

పోలీస్ : బొంకకు.. బొక్కలిరగ్గొట్టి పొయ్యిలవెడ్తం..
👊

సాయిలు : అయ్యో అమ్మతోడు సారు నాలేం తెల్వదు..
పోలీస్ : షాద్ నగర్ సాయిలు అంటే నువ్వే కదా..
సాయిలు : నేనే సారు కానీ నా పేరెందుకు రాశిండో నాకు తెల్వదు..
పోలీస్ : షాద్ నగర్ సాయిలు దగ్గర 40 L అని రాశిండు.. అంటే నీ దగ్గర 40 లక్షలు దాశివెట్టిండు.. ఏడున్నయో చెప్పు.. 😬
సాయిలు : నా దగ్గర అన్ని పైసలుంటే గీడెందుకుంట సారు..
😱

పోలీస్ : నక్రాల్ చెయ్యక్ రా బిడ్డా.. మంచి ముచ్చట కొద్ది చెప్పు.. 40 లక్షలెక్కడా..? 😈
సాయిలు : హా.. యాదికొచ్చింది సారు నేను పాల బ్యారం చేస్తా.. ఓసారి దావత్కి 40 లీటర్ల పాలు తీస్కవోయిండు ఉద్దెర ఖాతా వెట్టి.. ఒకపారి అడిగితే బెదిరిచ్చిండు ఇంగ పోతే వోని అనుకున్నా..
😷
😷


పోలీస్ : 40 L అంటే 40 లీటర్లా..?? 😎
సాయిలు : అవును సారు నా పేరు గిట్ల మరిశిపోకుండా యాదివెట్టుకుండు వాడెంత మంచోడో.. ఎక్కన్నన్న పైసలొత్తే నా పాల పైసల్ నాకిప్పియ్యిర్రి సారు.. 🙅
పోలీస్ : హా అట్లనే..
😠
