కొందరు వ్యక్తులు అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతుంటారు. దీనికి సంబంధించి ఆరోగ్య చిట్కాలు పాటించకుంటే.. ఊబకాయంతోపాటు గుండె సంబంధిత వ్యాధులు తీవ్రమవుతాయి. ఇంకా ఇతర హానికారక వ్యాధులు సంభవించే అవకాశముంది. ఇలా కాకుండా కొలెస్ట్రాల్ ను క్రమంగా తగ్గించుకుంటే.. నిత్యం ఆరోగ్యంగా మెలగవచ్చు. కొలెస్ట్రాల్ ని తగ్గించుకోవడానికి ఎంతో కష్టపడాల్సిన అవసరం లేదు. వ్యాయామం చేయడం, ఇతర కష్టతర పనులు చేయాల్సిన అవసరం లేదని నిపుణులు అంటున్నారు. ప్రతిరోజూ పచ్చి ఉల్లిపాయ తీసుకుంటే చాలు.. కొలెస్ట్రాల్ ని తగ్గించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు వెల్లడిస్తున్నారు.
ఉల్లిపాయలో క్రోమియం ఎక్కువ మోతాదులో నిల్వ వుంటుంది. అది వల్ల షుగర్ లెవల్స్‌ను క్రమబద్ధం చేస్తుంది. అలాగే టైప్2 డయాబెటిస్‌ను ఉల్లిపాయ నివారిస్తుంది. పచ్చి ఉల్లిపాయ నిత్యం తీసుకుంటే.. అధిక కొలెస్ట్రాల్‌ను అతి తక్కువ సమయంలోనే తగ్గించుకోవచ్చు. ఉల్లిపాయ గొప్ప యాంటీ ఇన్ల్ఫమేటరీ, యాంటీ సెప్టిక్, యాంటీ బయోటిక్, యాంటీ మైక్రో బ్యాక్టీరియల్ లక్షణాలను కలిగివుంది. ఇందులో విటమిన్ సి, బి1, బి6, విటమిన్ కె, బయోటిన్, క్రోమియం, క్యాల్షియం, ఫోలిక్ యాసిడ్, డైటరీ ఫైబర్ వంటివి పుష్కలంగా ఉన్నాయి. ఇన్ని పోషక విలువలు కలిగిన ఉల్లిపాయను ప్రతిరోజూ డైటింగ్ లో చేర్చుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు.
ఉల్లిపాయ సాధారణ జలుబు, దగ్గు, శ్వాసనాళపు వాపు, ప్ల్యూమోనియ, అధిక జ్వరం, ఆస్తమా వంటి జబ్బుల్ని నివారిస్తుంది. ఇంకా పొట్ట సమస్యలు, వికారం, డయేరియాను నివారించడానికి దోహదపడుతుంది. ఇందులో ఉండే యాంటీ క్యాన్సర్ పవర్ క్యాన్సర్‌ను దరిచేరనివ్వదు. ఈ ఉల్లిపాయ కేవలం ఆరోగ్యపరంగానే కాదు.. బ్యూటీపరంగానూ ఉపయోగపడుతుంది. ఉల్లిపాయ రసంను అప్లై చేయడం వల్ల జుట్టు మృదువుగా తయారవుతుందని బ్యూటీషియన్లు అంటున్నారు. అలాగే.. చర్మసమస్యల్ని నివారించుకోవడానికి ఈ ఉల్లిపాయతో ఎన్నో రెమెడీస్ చేసుకోవచ్చని వారు సూచిస్తున్నారు.