ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

SPEECH BY BRAHMASRI CHAGANTI KOTESWARA RAO GARU ON THE GREAT INDIAN FAMILY LIFE


వాచస్పతి శ్రీ చాగంటి కోటీశ్వర రావు గారు భారతీయ కుటుంబ వ్యవస్థ మీద "కుటుంబ వైభవం" అని చెన్నై లో చేసిన అద్భుత ప్రసంగం!
.
భారతదేశం ఈ ప్రపంచానికి సగర్వంగా ప్రదర్శించగల ఆదర్శాల్లో ముఖ్యమైనది కుటుంబవ్యవస్థ మరియు మన వివాహ వ్యవస్థ . భారతీయ కుటుంబ వ్యవస్థ మరియు వివాహాలు చాలా గొప్ప అని.. చాలామంది ఇప్పటికే ఈ వ్యవస్థను విదేశాలలో కూడా అనుసరిస్తున్నారు. కుటుంబ వ్యవస్థ భారతీయ సంస్కృతికి మూల స్తంభము. కుటుంబము అంటే గృహస్థు ధర్మ నిర్వహణకు వీలైన కేంద్రం, ఒక ఆలయం ఎలాగో . అలాగే ఇది మనకు. కుటుంబమంటే కొందరి వ్యక్తుల సమూహము మాత్రము కానే కాదు, అది ఆత్మీయత అనుబంధాల సమాహారం, మమతల కోవెల. అందుకే మన ఇళ్ళలోనే కాదు.. సాధారణంగా మన చుట్టు పక్కల వారితో కూడా చుట్టరికంతోనే పలకరింపులు తప్ప, పేర్లతో పిలుపులు సాధారణంగా మన భారతీయ సమాజములో వినపడవు. కులాలు , మతాలూ, తెగలు వేరు అయినా బాబాయి గారు, పిన్ని గారు, అక్క గారు, తమ్ముడు, మామ , పెదనాన్న, పెద్దమ్మ, అన్న , వదిన ఇలా వారి మధ్య రక్త సంబంధాలు లేకున్నా ఇలాంటి పిలుపులు ఉంటాయి. కుటుంబము అంటే కేవలం మనుషులే కాదు, పిల్లామేకా, చెట్టూచేమా, పశువూపక్షీ... అన్నీ మనకు మానవ పరివారంలో భాగమే. మన భారతీయ కుటుంబ వ్యవస్థ బామ్మలనీ, తాతయ్యలనీ, మావయ్యలనీ, బాబయ్యలనీ, అత్తయ్యలనీ, పిన్నిలనీ ... అన్నయ్యలని, వదినలను, తమ్ముళ్ళను, అక్కలను చెల్లెళ్ళను ఇస్తుంది. సాధరణముగా ఇన్నిరకాల అనుబంధాల నడుమ, విలువైన మమతానురాగాల మధ్య అపురూపంగా పెరిగిన పిల్లలు ఎక్కువ శాతం మంది మంచి యోగ్యమైన పౌరులు అవుతారు. . సమాజానికి సాయపడతారు.. వారందరిలో దేశభక్తి దైవభక్తి.పెద్దల పట్ల గౌరవ భావము .. ఇరుగు పొరుగుల పట్ల అభిమానం కలిగి ఉంటారు. . తమకు , తమవారికి , తమ కుటుంబానికి , తమ వంశానికి వన్నె తెచ్చే వారు అవుతారు. వీరిలో ఒంటరితనం, భద్రతా రాహిత్యం దగ్గరకు రానివ్వకుండా, పిల్లల్ని మన భారతీయ కుటుంబవ్యవస్థ చైతన్యవంతంగా తీర్చిదిద్దుతుంది. తల్లి దండ్రులు, భామ్మ తాతయ్యలు బాల్యంలో లాలనగా, విద్యార్థి దశలో క్రమశిక్షణగా, పదహారేళ్ళు వచ్చేసరికి స్నేహితుడిగా, పిల్లల్ని ఎలా పెంచాలో మనకు పెద్దలు నూరిపోశారు. సాధారణముగా వివిధ రంగాల్లోని విజేతల్నీ, పోటీ పరీక్షల్లో ఉత్తమశ్రేణి వారినీ ఆరాతీస్తే వారి వెనుక గొప్పదన్నుగా నిలిచిన పటిష్ఠ కుటుంబవ్యవస్థతో మనకు పరిచయం ఏర్పడుతుంది. సత్య నాదెళ్ళ కానివ్వండి మరెవరైనా ఆ విజేతలు అందరూ తమ కుటుంబములోని వ్యక్తుల వలనే తాము అంతగా ఎదిగామని సగౌరవముగా చెప్పుకుంటారు.

భారతీయ కుటుంబ వ్యవస్థ చాలా గొప్పది. ఇది నిర్జీవమైన యాంత్రిక బంధాల మధ్య పెరగడానికి, సజీవమైన బాంధవ్యాల మధ్య పెరగడానికీ చాలా తేడా ఉంది. ఒకప్పుడు ఎక్కడ చూసినా ఉమ్మడి కుటుంబాలు ఉండేవి.. ఇపుడు ఆర్థిక , వ్యక్తుల మరియు సమస్యల దృష్ట్యా అన్నీ చిన్న కుటుంబాలే.. పిల్లలకు భామ్మ, తాతయలు, పిన్ని బాబాయిలు కూడా అంతగా తెలియదు. ఏదో చుట్టం చూపుగా కలవడం తప్ప ఆత్మీయత అనుబంధాలు కరువు అయ్యాయి.పెళ్లవడం చాలు, కలహాలు వేరు కాపురాలు..ఒకప్పుడు మా ఊరిలోనే కాదు మా బంధువుల్లో కూడా చాలా ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. నేను ఉమ్మడి కుతుమ్బములోనే పుట్టి పెరిగాను.. మాది ఇపుడు కూడా ఉమ్మడి కుటుంబమే. ఇపుడు ఎక్కడో చుస్తే కానీ ఉమ్మడి కుటుంబాలు అస్సలు కానరావడము లేదు. Good families makes good society .. మంచి కుటుంబాలు మాత్రమే మంచి సమాజాన్ని ఇస్తాయి.. భారతీయ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ద్వారా మాత్రమే నేడు మన సమాజం ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకు పరిష్కారం లభించగలదని ఎందఱో గొప్పవారు చెబుతూనే ఉన్నారు.. కానీ మనమే ఆ వ్యవస్థ యొక్క గొప్పదనాన్ని తూలనాడుతున్నాము ఏది ఏమైనా ఎన్ని విపరీత ధోరణులు వచ్చినా , సవాళ్లు ఎదురైనా భారత కుటుంబ వ్యవస్థ ఎన్నటికీ విచ్ఛిన్నం కాబోదు. ఎటువంటి సవాళ్ళు ఎదురైనా ప్రజలు తమ మూలాలను గుర్తు పెట్టుకొని భారతీయ కుటుంబ వ్యవస్థను బలోపేతం చేస్తారు అన్న ఆశ మాత్రం ఉంది.