కేరళ ప్రాన్ పెప్పర్ ఫ్రై
వీకెండ్ లో స్పైసీ ఫుడ్ ఎలా ఉంటుంది?మీకు సీఫుడ్ తినాలిపిస్తుంటే, మీకోసం ఒక అద్భుతమైన ప్రాన్ రిసిపిని మీకోసం అంధిస్తున్నా . ప్రాన్స్ చాలా మంది ఇష్టమైన సీ ఫుడ్. ఈ రొయ్యలతో వివిధ రకాలుగా వంటలను వండుతారు.
వీకెండ్ లో స్పైసీ ఫుడ్ ఎలా ఉంటుంది?మీకు సీఫుడ్ తినాలిపిస్తుంటే, మీకోసం ఒక అద్భుతమైన ప్రాన్ రిసిపిని మీకోసం అంధిస్తున్నా . ప్రాన్స్ చాలా మంది ఇష్టమైన సీ ఫుడ్. ఈ రొయ్యలతో వివిధ రకాలుగా వంటలను వండుతారు.
ఈ రోజు మీకోసం కేరళ స్టైల్లో ప్రాన్ పెప్పర్ ఫ్రైను అంధిస్తున్నాం. ఈ సాప్ట్ అండ్ క్రీమీ ప్రాన్స్ ను ఎక్కువ మసాలా దినుసులు ఉపయోగించి తయారుచేయడం వల్ల ఈ రిసిపిని చాలా మంది ఇష్టపడుతారు. మరి ఈ కేరళ స్టైల్ ప్రాన్ పెప్పర్ ఫ్రై ఎలా తయారుచేయాలో చూడండి...
రొయ్యలు : 250 grm(రొయ్యలకు చివర్లో తోకలు కట్ చేసి శుభ్రం చేసుకోవాలి)
పచ్చిమిర్చి : 4
అల్లం : 25grm
వెల్లుల్లి : 25 grm
షలాట్స్ : 15 (లేదా 1 ఎర్ర ఉల్లిపాయ)
కరివేపాకు: 3 కొమ్మలను (ఇవే ఈ వంటను మరింత రుచికరంగా చేస్తుంది)
కొబ్బరి లేదా కొబ్బరి తురుము: 3tbsp
పెప్పర్ పౌడర్: 1tsp
కారం: 1tsp
పసుపు: 1/2tsp
ఆయిల్: సరిపడా
ఉప్పు: రుచికి సరిపడా
తయారుచేయు విధానం:
1. ముందుగా శుభ్రం చేసి పెట్టుకొన్న రొయ్యలను ఒక బౌల్లో వేసి, వాటితో పాటు, పసుపు, పెప్పర్ మరియు ఉప్పు, అల్లం వెల్లుల్లి, మరియు పచ్చిమిర్చి కూడా వేసి బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి.
2.పాన్ లో కొద్దిగా నూనె వేసి, అందులో కరివేపాకు మరియు ఉల్లిపాయలు ముక్కలు వేసి వేగించాలి. ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేగించుకోవాలి.
3. ఇప్పడు అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి వేసి బాగా వేగించుకోవాలి.
4. ఈ పదార్థాలన్నీ వేగుతూ, మంచి ఆరోమా స్మెల్ వచ్చే వరకూ వేగించుకోవాలి.
5. ఇప్పుడు అందులో ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకొన్న రొయ్యలు మరియు వాటితో పాటు మసాలా కూడా వేసి ఫ్రై చేయాలి. ప్రాన్స్ ను ఎక్కువగా ఉడికించకూడదు.
6. కొద్దిగా ఉప్పు చేర్చి, ప్రాన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకూ మరో రెండు మూడు నిముషాలు వేగించుకోవాలి. అయితే ఎక్కువ సేపు ఉడికించకూడదు, ఫ్రైచేసుకుంటే సరిపోతుంది.
7. చివరగా అందులో కొబ్బరి ముక్కలు లేదా కొబ్బరి తురమును జోడించి మిక్స్ చేసి, రైస్ లేదా చపాతీతో సర్వ్ చేయండి.