బెండకాయ మసాలా కూర
కావల్సినవి:
బెండకాయలు - పన్నెండు, మినప్పప్పు - పావుకప్పు, సెనగపప్పు - అరకప్పు, ధనియాలు - రెండు టేబుల్‌స్పూన్లు, జీలకర్ర - చెంచా, ఎండుమిర్చి - పది, పల్లీలు - పావుకప్పు, నూనె - వేయించేందుకు సరిపడా, ఉప్పు - తగినంత, పసుపు - అరచెంచా.
తయారీ:
బాణలిలో రెండు చెంచాల నూనె వేడిచేసి మినప్పప్పూ, సెనగపప్పూ, ధనియాలూ, జీలకర్రా, ఎండుమిర్చీ, పల్లీలూ వేయించుకుని తీసుకోవాలి. వాటి వేడి చల్లారాక తగినంత ఉప్పూ, పసుపూ వేసి మిక్సీలో పొడిలా చేసుకోవాలి. ఇప్పుడు బెండకాయల ముచ్చికలు తీసేసి నిలువుగా తరిగి ఈ కారాన్ని వాటిల్లో కూరాలి. బాణలిని పొయ్యిమీద పెట్టి మిగిలిన నూనె వేయాలి. అది వేడయ్యాక ఈ బెండకాయల్ని అందులో ఉంచి ఎర్రగా వేయించుకోవాలి. అవి వేగాక మిగిలిన కూర కారాన్ని వేస్తే సరిపోతుంది.