ఆడవారి గుండెపోటు
గుండెపోటు అనగానే మనకు గుండెను చేత్తో పట్టుకుని విలవిల్లాడిపోయే దృశ్యాలే కనిపిస్తాయి. కానీ అన్ని సందర్భాలలోనూ గుండెపోటుని సూచించే లక్షణం ఇదే అన్న అపోహలో ఉండవద్దు అంటున్నారు నిపుణులు. ముఖ్యంగా స్త్రీలలో వచ్చే గుండెపోటు మరింత భిన్నమైన సూచనలను అందిస్తాయని హెచ్చరిస్తున్నారు.
ఆడవారికే ప్రాణాంతకం
రొమ్ము క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్ వంటి క్యాన్సర్ల వలనే స్త్రీలలో మరణాలు ఎక్కువని చాలామంది భ్రమ పడుతూ ఉంటారు. నిజానికి ప్రపంచవ్యాప్తంగా స్త్రీల మరణాలకు గుండెజబ్బులే ముఖ్య కారణం అని WHO సైతం తేల్చిచెబుతోంది. పైగా మగవారితో పోలిస్తే ఆడవారు గుండెపోటు వచ్చాక కోలుకునే అవకాశం తక్కువని కూడా కొన్ని పరిశోధనలు రుజువు చేస్తున్నాయి. గుండెపోటు వచ్చిన వెంటనే చికిత్సని తీసుకోకపోవడం దీనిని ముఖ్య కారణంగా భావిస్తున్నారు.
వైద్యునికి కూడా తోచనిది
మగవారిలో గుండెపోటుకి సంబంధించిన సూచనలు అందరికీ తెలిసినవే! ఎడమ చేయిలాగడం లేదా మొద్దుబారిపోవడం, గుండె దగ్గర విపరీతమైన నొప్పి, ఊపిరి అందకపోవడం... వంటి లక్షణాలు కనిపించిన వెంటనే మగవారు జాగ్రత్తపడిపోతుంటారు. కానీ స్త్రీల విషయంలో ఇలా కాదు! పై లక్షణాలే కాకుండా వెన్ను నొప్పి, వికారం, దవడ లాగడం, కళ్లు తిరగడం, నీరసించిపోవడం, కడుపులో నొప్పి రావడం వంటి ఇతర లక్షణాలు కూడా కనిపించే అవకాశం ఉంది.
ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు అది ఏదో పని ఒత్తిడి వలన తాత్కాలికంగా ఏర్పడిన సమస్యగా భావిస్తుంటారు. కాస్త విశ్రాంతి తీసుకుంటే తగ్గిపోతుందనో, కాస్త మర్దనా చేస్తే తీరిపోతుందనో అశ్రద్ధ చేస్తుంటారు. ఒకోసారి సాధారణ వైద్యులు కూడా ఈ లక్షణాలు గుండెపోటుకి చిహ్నమమని గుర్తించలేకపోతుంటారట. ఫలితం! అత్యవసర వైద్యం అందాల్సిన సమయం కాస్తా దాటిపోతుంది. అందుకనే గుండెపోటు మగవారికంటే ఆడవారినే ఎక్కువగా కబళిస్తోంది.
అశ్రద్ధ కూడదు
40 ఏళ్ల వయసు దాటినవారు, రక్తపోటుతో బాధపడేవారు, వంశపారంపర్యంగా గుండెజబ్బులు ఉన్నవారు, అధిక కొలెస్టరాల్ వంటి సమస్యలు ఉన్నవారు... ఎలాంటి సూచననీ అశ్రద్ధ చేయడం మంచిది కాదు. శరీరంలో ఏదన్నా భరించలేని నొప్పి వచ్చినప్పుడు వెంటనే వైద్యుని సంప్రదించడం ముఖ్యం. అసలు అలాంటి పరిస్థితి రాకుండా నివారించేందుకే ప్రయత్నించమంటున్నారు నిపుణులు. రోజుకి కనీసం ఒక అరగంటపాటైనా వ్యాయామం చేయమనీ, రక్తపోటు వంటి సమస్యలకు అశ్రద్ధ చేయకుండా చికిత్స తీసుకోమనీ సూచిస్తున్నారు. అన్నింటికీ మించి ఒత్తిడిని కనుక అదుపులో ఉంచుకోగలిగితే గుండెపోటుని కూడా అదుపులో ఉంచుకొన్నట్లే అంటున్నార