ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

LORD SHANI VIGRAHA SWAROOPAM


శని గ్రహం యొక్కరూపము

శని నీల కాంతి కలిగిన మేని ఛాయ కలవాడు. నాలుగు భుజములు కలవాడు. ధనుర్భాణాలు, శూలం ధరించిన వాడు. కాకిని వాహనంగా చేసుకున్న వాడు. శనికి నిదానంగా సూర్యుడిని చుట్టి వస్తాడు కనుక మందుడు అని పిలుస్తారు. పంగు, సౌరి అను ఇతర నామాలు ఉన్నాయి. సూర్యుడికి ఛాయాదేవికి కలిగిన పుత్రుడు. మాఘ మాసం కృష్ణ పక్షం చతుర్ధశి నాడు ధనిష్ఠా నక్షత్రంలో విభవానామ సంవత్సరంలో జన్మించాడు. 

శనిభగవానుడి సోదరి యమున, సోదరుడు యముడు, భార్య జ్యేష్టాదేవి. సూర్యుడి భార్య త్వష్ట ప్రజాపతి కుమార్తె సజ్ఞాదేవి సూర్యుడి తాపం భరించ లేక తనకు ప్రతిగా ఛాయాదేవిని సృష్టించి పుట్టింటికి వెళ్ళిన సమయంలో శని జన్మించాడు. తరువాత కాలంలో సూర్యుడిని చేరిన సజ్ఞాదేవి శనిని సరిగా చూడని కారణంగా శని ఆమెను కాలితో తన్నాడు. ఆకారణంగా శనిని ఆమె శపించంగా శనికి మందగమనం ప్రాప్తించింది.