నిమ్మరసం-తేనె మిశ్రమం వలన కలిగే అద్భుత ప్రయోజనాలు
తేనె కలిపిన నిమ్మరసం శరీర బరువును తగ్గిస్తుంది.
ఈ మిశ్రమం మలబద్దకం నుండి కూడా ఉపశమనం తగ్గిస్తుంది.
కిడ్నీలో రాళ్లు తొలగిపోవటానికి ఈ మిశ్రమాన్ని తప్పక తాగండి
నిమ్మరసంలో కలిపిన తేనె మిశ్రమం ఎన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలిగిస్తుందో దాదపు మనందరికి తెలిసిందే. జీర్ణం, ఫిట్నెస్ తో పాటూ ఇంకా చాలా రకాల అధ్భుతమైన ప్రయోజనాలను కలిగిస్తుంది. ఆరోగ్యంగా ఉండటాలంటే రోజులో ఒక్కసారి తప్పనిసారిగా ఈ మిశ్రమం తాగాల్సిందే అంటున్నారు నిపుణులు.
ఇది కూడా చదవండి : వెల్లుల్లి రసం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
ఎందుకంటే అతి త్వరగా సహజంగా బరువును తగ్గించే అద్భుతమైన ఔషధ గుణాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయంటున్నారు. అంతే కాదు తేనె-నిమ్మరసం కలయికలో ఇంకా బోలెడన్నీ ఆరోగ్యప్రయోజనాలు ఉన్నాయంటే మీరు ఆశ్చర్యానికి గురికాక తప్పదు. మరీ ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడుతుందో మీరే తెలుసుకోండి...
శరీరాన్ని శుభ్రపరచడానికి
నిమ్మరసం వలన కలిగే మరొక ఆరోగ్య ప్రయోజంగా దీనిని పేర్కొనవచ్చు. నిమ్మరసం, తేనెతో మిశ్రమంతో తీసుకొనే ఈ జ్యూస్ ను వలన శరీరంలోని విషపదార్థాలు బయటకు నెట్టివేయబడతాయి. మీరు కానీ సులభంగా బరువు తగ్గి, మెరిసే చర్మాన్ని పొందాలనుకుంటే, ఈ జ్యూస్ ను క్రమం తప్పకుండా తాగాలి. తేనె, నిమ్మరసం వేడినీళ్ళతో మిక్స్ చేసి తాడం వల్ల మలబద్దకాన్ని పోగొట్టి, ప్రేగును శుభ్రం చేస్తుంది.
కిడ్నీలో రాళ్ళు ఏర్పడకుండా నిరోధిస్తుంది
నీళ్ళు తక్కువగా తాగడం, శరీరంలో కాల్షియం స్థాయిలు పెరగటం వలన కిడ్నీలో రాళ్ళు ఏర్పడుతాయి. మూత్రాన్ని ఎక్కువ సమయం పాటూ పోకుండా అలాగే ఉండటం వలన కూడా ఈ సమస్య కలుగుతుంది. ఫలితంగా కాల్షియం చిన్న చిన్న రాళ్లు గా నిక్షేపం అవటం వలన మూత్రపిండాలలో రాళ్లుగా ఏర్పడతాయి. తేనె మరియు నిమ్మరసం వీటిని కరిగించటంలో శక్తివంతంగా పని చేస్తుంది. శరీరంలో ఉండే అదనపు కాల్షియంను తొలగించుటకు నిమ్మరసం బాగా పనిచేస్తుంది.
బరువు తగ్గిస్తుంది
ఈ మిశ్రమంతో కలిగే ఆరోగ్య ప్రయోజనాల్లో ఇది ఒక ముఖ్యమైనది. కొద్దిగా గోరువెచ్చని నీటిలో నిమ్మరసం, కొన్ని చుక్కల తేనె కలిపి చేసి ఉదయాన్ని పడికడుపున తాగటం వలన శరీరంలో నిల్వ ఉన్న అధిక కొవ్వు పదార్థాలు కరగటంలో ఇది సహాయపడుతుంది నిమ్మరసంలో ఉండే సిట్రిక్ యాసిడ్ మరియు తేనెలోని యాంటి ఆక్సిడెంట్స్ గుణాలను వేడి నీళ్ళలో కలపటం వలన బరువు తగ్గించే అద్భుతమైన జ్యూస్ తయారైందని చెప్పవచ్చు. బరువు తగ్గించుకోవడానికి అధికంగా వ్యాయామాలు చేసే వారికీ ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది.
జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది
నిమ్మరసంతో వలన కలిగే మరొక అద్భుతమైన ఆరోగ్య ఏమిటంటే జీర్ణవ్యవస్థకు సంబంధించిన రుగ్మతలను నివారిస్తుంది. పొట్టలో ఆసిడ్ సమస్యలు లేదా గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడుతున్నట్లైతే నిమ్మరసం, తెనె మిశ్రమాన్ని కలిపిన జ్యూస్ ను తాగండి.
గొంతు నొప్పిని నివారిస్తుంది
గొంతులో దురద, దగ్గు, బొంగురు పోవడాన్ని ఈ జ్యూస్ అరికడుతుంది. తేనెలో యాంటీబ్యాక్టీరియల్ గుణాలను కలిగి ఉండటం వలన గొంతు సమస్యలు కలిగించే సుక్ష్మ జీవులను చంపేస్తుంది . వేడినీళ్ళు గొంతు శుభ్రం చేయడానికి మ్యూకస్ గ్రంథులు తెరిచుకోవడానికి సహాయంచేస్తుంది.