ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

YALUKALU ALLAM TEA HEALTH BENEFITS IN TELUGU


యాలకులు - అల్లం కలిపి తీసుకుంటే...

యాలకలను రెండు రకాలలో లభిస్తుంటాయి. చిన్న యాలకులు లేదా పెద్ద యాలకులు. పెద్దపెద్ద యాలకలు తినుబండారాలలో సువాసనలు వెదజల్లేందుకు ఉపయోగిస్తుంటారు. అదే చిన్న యాలకలు తీపి పదార్థాలలో కలుపుతుంటారు. మనం తినే ఆహార పదార్థాలలో మాత్రమే వీటిని ఉపయోగించుకుంటామనుకుంటే పొరపడినట్లే. ఇందులో ఔషధ గుణాలున్నాయి. ఆ ఔషధ గుణాలేంటో చూద్దాం.

గొంతులో గరగర : దగ్గుతో ఇబ్బందిపడి గొంతులో (కిచ్కిచ్) మంట, బొంగురుపోయినట్లుంటే ఉదయం లేవగానే యాలకలను నమిలి తినండి. ఆ తర్వాత గోరువెచ్చని నీటిని త్రాగండి. ఉపశమనం కలుగుతుంది.

వాపు : గొంతులో వాపు సంభవిస్తే ముల్లంగిని నానబెట్టిన నీటిలో యాలకలను రుబ్బి సేవిస్తే ఉపశమనం కలుగుతుంది.

దగ్గు : వర్షా కాలంలో జలుబు, దగ్గు, తుమ్ములు ఎక్కువగా వస్తుంటాయి. ఇలా వున్నప్పుడు యాలకలు, అల్లం ముక్క, లవంగ మరియు ఐదు తులసి ఆకులు కలిపి సేవిస్తే ఉపశమనం కలుగుతుంది.

నోట్లో పొక్కులుంటే : నోట్లో పొక్కులుంటే యాలకలతోపాటు కలకండను కలిపి పేస్ట్‌లా చేసుకోండి. ఈ మిశ్రమాన్ని నాలుకపై ఉంచుకోండి. దీంతో వెంటనే ఉపశమనం కలుగుతుంది.

వాంతులు : వాంతులు అయినప్పుడు అరలీటరు నీటిలో ఐదు గ్రాముల యాలకలను వేసి ఉడకబెట్టండి. బాగా కాగిన తర్వాత నీరు 1/4వ వంతు వచ్చినప్పుడు తీసి ఆ నీటిని సేవిస్తే వాంతులు తగ్గి, శరీరంలోని నీరసం తగ్గుతుంది. దీంతో మంచి ఉపశమనం కలుగుతుందంటున్నారు ఆరోగ్యనిపుణలు.