ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

MALLESWARI 1951 - NTR AND BHANUMATHI - LEGENDARY TELUGU MOVIE - STORY AND ITS MAKING FACTS


మల్లీశ్వరి – 65 ఏళ్ళ సున్నితమైన దృశ్యకావ్యం!
.
మల్లీశ్వరి- తెలుగు సినిమా చిత్రాలలో ఇది మరిచిపోలేని చిత్రం. 1951 లో విడుదల ఆయన ఈ చిత్రం, చాలా మంది తెలుగు ప్రజలకి చిరకాలం గుర్తు ఉండిపోయింది. దాదాపు 60 ఏళ్ళ క్రితం వచ్చిన ఈ చిత్రం ఇప్పటికీ చాలా గొప్ప చిత్రంగా కొనసాగుతోంది.
.
ఎన్టీఆర్, భానుమతి ల యొక్క కాంబినేషన్ ఈ చిత్రానికే పెద్ద ఆస్తి అని చెప్పాలి. మల్లీశ్వరి పాత్ర లో భానుమతి ఎంత సుందరం గా అద్భుతంగా జీవించారో ఆ చిత్రాన్ని చూసినవాళ్లకే తెలుస్తుంది. ఒక కథానాయకి సున్నితమైన మనస్సు ఉన్న అమ్మాయిలా ఎలా చెయ్యాలి, ఎలా ఉంటుందో ఈ సినిమాలో చూడచ్చు.

ఆకతాయి గా ఉండే ‘మల్లీశ్వరి’ చిన్ననాటి నుండి తన బావ ఆయన ‘నాగరాజు’ తో నే తన జీవితాన్ని ఊహించుకుంటుంది. ఇద్దరిమధ్య చాలా సరదా సన్నివేశాలు, ఆటపట్టించుకునే సందర్భాలు, అందమైన పాటలు వీక్షకులను ఎంతగానో అలరిస్తాయి. ఈ చిత్రం లో ని పాటలు అన్ని ఒకరకమైన ట్రెండ్ ను ఆ రౌజుల్లోనే సృష్టించి పెట్టింది.

చాలా నిరు పేద కుటుంబానికి చెందిన శిల్పి అయిన ‘నాగరాజు’ తన ఊర్లో శిల్పాలు చెక్కుకుంటూ తన మరదలి తో ఎంతో ఆనందం గా ఉంటాడు . కానీ, మల్లీశ్వరి, వాళ్ళ మామయ్యా ‘హనుమంతప్ప’ ఊరి పెద్ద కావటం తో తన మేనకోడలికి గొప్ప సంబంధం చూద్దామని ఆరాట పడుతూ ఉంటాడు. ‘మల్లీశ్వరి’ అమ్మ కూడా అంతఃపురం పై ఎంతో ఆసక్తి చూపుతూ ఉండేది. ఆ క్రమంలోనే ‘నాగరాజు’ ని డబ్బు తో కొలిచి అసహ్యించుకునేది.

ఇది తెలిసిన తరువాత, నాగరాజు ఊరు వదిలి డబ్బు సంపాదించటానికి వెళతాడు. ఆ సమయం లో, రాయలవారినుండి రాణివాసానికి పిలుపు వస్తుంది. ఎందుకంటే ఇదివరకు, మారువేషం లో ‘శ్రీకృష్ణదేవరాయలు’, ‘అల్లసాని పెద్దన్న’ లు వచ్చి, ‘మల్లేశ్వరి’ ఆటలు పాటలు చూసి మెచ్చుకుని ఎం కావలో కోరుకొమ్మంటారు. అప్పడు నాగరాజు, సరదాగా ‘మల్లీశ్వరి కి రాణి వాసం కల్పించామని అడుగుతాడు. ఆ సరదా మాటను, శ్రీ కృష్ణదేవరాయలు నిజం చేసి రాణి వ్యాసానికి ఆజ్ఞాపిస్తారు.

‘నాగరాజు’ లేని సమయం లో, ‘మల్లీశ్వరి’ రాణి వాసానికి వెళ్ళిపోతుంది. ఇక అక్కడినుండి ఇద్దరికి దుఃఖం మొదలవుతుంది. ఒకరిని ఒకరు చూసుకోటానికి కలుసుకోటానికి ఆరాటపడి ఆవేదన చెందుతూ ఉంటారు. చెలికత్తె సహాయంతో, బయటకు పారిపోదాం అని నిశ్చయించుకుంటుంది.

కానీ అవేమి కుదరక అంతఃపురం లోనే తన బావను తల్చుకుంటూ బాధ తో ఉంటుంది. ‘నాగరాజు’ కూడా అంతే దుఃఖం తో పిచ్చివాడు అయిపోతాడు. అదే సమయం లో ‘నర్తనశాల’ ఏర్పాటు కు గానూ శిల్పి కోసం దేవరాయల ఆస్థానానికి పిలిపిస్తారు. ఆ శిల్పాలు చెక్కే సమయం లో ‘మల్లీశ్వరి’ తన బావను గుర్తించి ఉబ్బి తబ్బిబైపోతుంది.

ఇంక చెలికత్తె సహాయంతో బయట కలుసుకుని, పారిపోయే ప్రయత్నాలు చేస్తుంది. దాదాపు వదిలి పారిపోదాం అనుకునే సమాయానికి దేవరాయలు నాట్య కార్యక్రమం ఏర్పాటు చేస్తారు.

అదే సమయం లో ‘నాగరాజు’ కోటలో చొరబడి పట్టుబడత్తాడు. ఆ క్రమంలో ఇద్దరు దేవరాయల ముందు శిక్షకు తీసుకెళ్లబడతారు . కానీ ఈ ‘మాల్లీశ్వరి’ రాణి వాసం ఉందంతం మొత్తం దేవరాయలు గుర్తుచెయ్యగా అసలు విషయం బయటపడి శిక్షనుండి ఇద్దరినీ విముక్తులు చేస్తారు. ఈ దెబ్బతో ఇద్దరి చిరకాల వాంఛ ప్రకారం పెళ్లి చేసుకుంటారు.

ఇలా, ఎంతో సున్నితమైన మనస్కులైన ‘మల్లేశ్వరి’, ‘నాగరాజులు’ కథ ఈ చిత్రం ఎంతో అందంగా పాటలతో వీక్షకులకు దృశ్య, శ్రవణానందం కలిగిస్తుంది.

ఈ సినిమా (Malliswari 1951) ‘బీఎన్ రెడ్డి’ గారు దర్శకత్వం వహించారు. చిత్రంలోని పాటలు చాలా ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి.

‘మనసున మల్లెల వాన’
‘పిలిచినా బిగువతారా’
‘ఆకాశ వీధిలో’
‘పరుగులు తీయాలి’
ఇలా అన్ని పాటలు ఒక్కొక్క ఆణిముత్యం గా నిలిచాయి. ఎస్ రాజేశ్వరరావు గారి సంగీతం తో అన్ని పాటలు చాలా మృదువుగా సున్నితంగా అందరికి గుర్తుండిపోయాయి.
నటన విషయానికి వస్తే, అన్నగారు తన సహజసిద్ధమైన శైలి తో ‘నాగరాజు’ గా అందరి హృదయాల్లో నిలిచిపోతారు.

భానుమతి గారు ఈ చిత్రానికి ఆయువుపట్టు, ఆమె అందం, నవ్వు, అభినయం మాటల్లో ఎంత రాసినా ఆమెగురించి చిన్నబుచ్చినట్టు అవుతుంది. ఆ రోజుల్లో అంత సహజంగా నటన చెయ్యగలిగే అతి అరుదైన నటి ఆమె ఒక్కరే అనటం లో ఏమాత్రం సందేహం లేదు.

తన బావ గురించి బాధ పడుతూ ఆమె పాడే పాట ‘ఆకాశ వీధిలో’ లో ఆమె అభినయం, అత్యద్భుతం వర్ణనాతీతం. ఇంకో ప్రత్యేకత ఏంటంటే, ఈ చిత్రం లో అన్ని పాటలు ‘భానుమతి’ గారే పాడటం . ఆ రోజుల్లో అల్ రౌండర్ యాక్ట్రెస్ భానుమతి గారే.

మొత్తానికి, మల్లీశ్వరి పెద్ద సినిమా, మెల్లగా సాగే చిత్రం ఐనాసరీ, ఈ కాలం మలయాళం, లేదా ఆర్ట్ సినిమాలకు ఏ మాత్రం తీసిపోదు, ఇంకా చెప్పాలంటే వాటిని మించి గొప్పగా ఉంది.

ఎందుకంటే, ఏమాత్రం ఆధునీక పరికరాలు లేని ఆరోజుల్లో ఇంత సృజన తో, అభినయంతో, కథతో, వైవిధ్యంతో, సంగీతంతో, సాహిత్యంతో కూడిన ఈకైక చిత్రం. ఇంకా ఈ చిత్రం లో కలానికి అందని ఎన్నో అద్భుతమైన సన్నివేశాలు ఉన్నాయి, అవి మీరు మీ కళ్ళతో చూడటమే సరియన తీరు. ఇలాంటి గొప్ప కథ ఇచ్చినందుకుగాను, ‘దేవులపల్లి కృష్ణశాస్త్రి’ గారికి జోహార్లు.

తెలుగునాట కళాత్మక చిత్రాలకు నాంది మల్లీశ్వరి ఇది సందేహం లేని నిజం.