పాపం రవి* జోక్
బుజ్జి పరిగెత్తుకుంటూ, పక్కింటిలోకి దూసుకెళ్ళింది. "హరీ,హరీ, ఎక్కడున్నావు?" అంటూ అన్ని గదుల్లోకి కలయతిరిగింది. ఇంతలో హరి ఇంట్లోకి వస్తూ కనిపించాడు.
"ఎక్కడికి వెళ్ళావ్" అడిగింది బుజ్జి.
"మీ ఇంటికే" చెప్పాడు హరి.
"సరే, నీకు తెలుసా, మీ క్లాసులో ఎత్తుగా ఉంటాడే ఆ రవిగాడు పాపం వికలాంగుడు అయిపోయాడు.
"వాడికి ఏం జరిగింది?" అడిగాడు హరి ఆతృతగా.
"ఏమో నాకు తెలీదు, ఇందాక మేము మా ఊరినుండీ బస్సులో వస్తుంటే, వాడు వికలాంగుల సీటులో కూర్చుని కనబడ్డాడు. పాపం పలకరిద్దామంటే బస్సు బాగా రద్దీగా వుంది" చెప్పింది ఆరేళ్ళ బుజ్జి.