జ్వరం వచ్చిన గంగమ్మని భర్త పరమేశం డాక్టరు దగ్గరికి తీస్కెళ్ళాడు.
డాక్టరు గంగమ్మ నాడి పట్టుకుని చూశాడు. కళ్ళక్రింద చర్మం క్రిందికి లాగి చూశాడు. నాలుక బయటకు చూపమని చూశాడు. తర్వాత గంగమ్మ నోటిలో ధర్మామీటరు పెట్టి "నోరు మూస్కోమ్మా!" అన్నాడు. గంగమ్మ నోరుమూసుకుంది.
వెంటనే పరమేశం డాక్టరు పాదాల మీద అమాంతం పడిపోయి నమస్కారం చేశాడు.
"అయ్యెయ్యో... ఇదేంటండీ! లేవండి లేవండి... ఒట్టి జ్వరమే కదా ఎందుకంత భయం?" అన్నాడు డాక్టరు కంగారుగా వెనక్కి జరుగుతూ.
"అదికాదు డాక్టర్! మా ఆవిడని నోరు ముయ్యమని చెప్పిన ఓ మగాడికి శిరస్సువంచి పాదాభివందనం చేయాలనిపించింది!" అన్నాడు పరమేశం పరవశంగా డాక్టర్ వంక చూస్తూ.