ఉల్లితో మధుమేహం, బీపీ దూరం
ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు పెద్దలు. ఈ మాట అక్షరా లా నిజమని శాస్త్రవేత్తలు ఇప్పుడు చెబుతున్నారు. స్థూలకాయాన్ని తగ్గించడంతోపాటు బీపీ, మధుమేహ నివారణకు ఉల్లిపాయలు ఎంతగానో దోహదపడతాయని దక్షిణ క్వీన్స్‌లాండ్ యూనివర్సిటీ జీవవైద్య శాస్త్రవేత్తలు తాజాగా కనుగొన్నారు. ఎలుకలపై పరిశోధనలు నిర్వహించిన అనంతరం అధిక రక్తపోటును కూడా ఉల్లి సమర్థంగా నియంత్రిస్తుందని వెల్లడైనట్లు శాస్త్రవేత్తల బృందం తెలిపింది.