ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

SIMPLE NATURAL TIPS TO STOP COUGH PROBLEM


పొడి దగ్గు కి ఇంగ్లీష్ మందులతో నివారణ లేదు.. కానీ ఇలా చేస్తే పొడి దగ్గు పోతుంది!!
వాతావరణంలో మార్పులు, పొగ, దుమ్ము, రసాయనాల వాడకం వల్ల పొడి దగ్గు వస్తుంది. పొడిదగ్గును ఆదిలోనే అరికట్టకపోతే ఆపై అనేక నష్టాలు కలుగుతాయి. పొడిదగ్గువల్ల తల పట్టేస్తుంది. గొంతుతో పాటు శ్వాసకు సంబంధించిన సమస్యలు కలుగుతాయి. పొడిదగ్గు తీవ్ర రూపం దాల్చితే మరిన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయి. అందుకే పొడిదగ్గు విషయంలో అప్రమత్తంగా ఉండాలి. చిన్న చిన్న చిట్కాలు ఫాలో అవుతూ పొడిదగ్గును అరికట్టాలి.

ఇవి చేస్తే పొడి దగ్గు యిట్టె తగ్గిపోతుంది:
* పొడి దగ్గుతో ఉండేవారు గోరువెచ్చని నీటిని మాత్రమే తాగాలి.
* నీళ్లను కొంచెం కొంచెం తాగుతూ ఉండాలి. దీనివ్ల గొంతులో తడి ఆరకుండా ఉంటుంది.

* ఊపిరి పీలుస్తూ వేడి ఆవిరి పట్టుకోవాలి. దీని వల్ల శ్లేష్మం వెళ్లిపోతుంది.
* తేనె, పిప్పరమెంట్స్‌ తీసుకోవటం వల్ల కాస్త ఉపశమనం లభిస్తుంది.
* గ్రీన్‌ టీ తాగటం వల్ల పొడి దగ్గు తగ్గేందుకు ఎక్కువ అవకాశాలున్నాయి.
* పొగ తాగటం మానేయాలి. ధూమపానం వల్ల పొడి దగ్గు తీవ్రత పెరుగుతుంది.