ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

STOP SUPER SUMMER 2017 WITH PURE NATURAL DESI THATI MUNJELU


తాటి ముంజ‌ల‌ను వేస‌విలో తిన‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్యాల‌ను దూరం చేసుకోవ‌చ్చో తెలుసా..?

వేస‌వి కాలంలో సీజ‌న‌ల్ పండుగా ల‌భించేది మామిడి. దీన్ని ఈ కాలంలో చాలా మంది తింటారు. అయితే దీంతోపాటు ఇంకోటి కూడా మ‌నంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తుంది. అది తాటి ముంజ‌. అవును, అదే. మండే ఎండ‌ల్లో చ‌ల్ల చ‌ల్ల‌ని తాటి ముంజ‌ల‌ను తింటే వ‌చ్చే మ‌జాయే వేరు. దీంతో శ‌రీరం చ‌ల్ల‌గా ఉండ‌డ‌మే కాదు, మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన కీల‌క పోష‌కాలు అందుతాయి. ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌లు కూడా న‌య‌మ‌వుతాయి. ఎక్కువ‌గా గ్రామీణ ప్రాంతాల్లో ముంజ‌లు ల‌భించినా, నేటి త‌రుణంలో సిటీలో కూడా ఇవి ఎక్కువ‌గానే మ‌న‌కు దొరుకుతున్నాయి. ఈ క్ర‌మంలో ఈ సీజ‌న్‌లో తాటి ముంజ‌ల‌ను రెగ్యుల‌ర్‌గా తింటే దాంతో మ‌న‌కు ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

1. అర‌టి పండ్ల‌లో పొటాషియం ఎంత ఉంటుందో అంతే మొత్తంలో పొటాషియం తాటి ముంజ‌ల్లోనూ ఉంటుంది. దీంతో గుండె ఆరోగ్యం ప‌దిలంగా ఉంటుంది. ర‌క్త స‌ర‌ఫరా మెరుగు ప‌డుతుంది. బీపీ అదుపులో ఉంటుంది.

2. శ‌రీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ పోతుంది. మంచి కొలెస్ట్రాల్ వృద్ధి చెందుతుంది. గుండె స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి. అధిక బ‌రువు త‌గ్గుతారు.

3. ఎండాకాలంలో మ‌న ఒంట్లో నీరు వేగంగా ఖ‌ర్చ‌వుతుంది. ఈ క్ర‌మంలో మ‌నం డీహైడ్రేష‌న్ బారిన ప‌డ‌తాం. అయితే అలాంటి స్థితిలో తాటి ముంజ‌ల‌ను తింటే దాంతో శ‌రీరంలోకి ద్ర‌వాలు వ‌చ్చి చేర‌తాయి. డీహైడ్రేషన్ బారి నుంచి త‌ప్పించుకోవ‌చ్చు.

4. జీర్ణ సంబంధ స‌మ‌స్య‌లు పోతాయి. గ్యాస్‌, అసిడిటీ, మ‌ల‌బ‌ద్ద‌కం నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణ‌మ‌వుతుంది.

5. ఎండాకాలంలో శ‌రీరం వేడిగా ఉండేవారు తాటి ముంజ‌ల‌ను తిన‌డం మంచిది. దీంతో ఒళ్లు చ‌ల్ల‌బ‌డుతుంది. హాయినిస్తుంది.

6. గుండె స‌మ‌స్య‌లు ఉన్న వారు, అధిక బ‌రువు ఉన్న వారు, షుగ‌ర్ ఉన్న‌వారు నిర‌భ్యంత‌రంగా తాటి ముంజ‌ల‌ను తిన‌వ‌చ్చు.

7. తాటి ముంజులలో శరీరానికి కావాల్సిన ఎ, బి , సి విటమిన్లు ఐరన్ , జింక్ , పాస్ఫరస్ , పొటాషియం వంటి పోషకాలు ఉంటాయి. ఇవి శ‌రీర బ‌రువును అదుపులో ఉంచుతాయి.

8. తాటి ముంజ‌ల‌లో ఉండే పొటాషియం శ‌రీరంలో ఉన్న విష ప‌దార్థాల‌ను బ‌య‌టికి పంపుతుంది. దీంతో శ‌రీరం అంత‌ర్గ‌తంగా శుభ్ర‌మ‌వుతుంది.

9. వేస‌విలో ఎండల కార‌ణంగా వాంతులు, విరేచ‌నాలు అవుతున్న వారికి తాటి ముంజ‌ల‌ను తినిపించాలి. దీంతో ఆయా స‌మ‌స్య‌ల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

10. తాటి ముంజ‌ల‌ను తింటే శ‌క్తి బాగా వ‌స్తుంది. రోజంతా యాక్టివ్‌గా ఉండ‌వ‌చ్చు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధుల‌కు ఇవి మేలు చేస్తాయి.

11. బ్రెస్ట్ క్యాన్స‌ర్‌తోపాటు ప‌లు ర‌కాల ఇత‌ర క్యాన్స‌ర్ల‌ను కూడా రాకుండా అడ్డుకునే గుణాలు తాటి ముంజ‌ల్లో ఉన్నాయి.