భారతీయ వంటలలో బెల్లం ఒక ముఖ్యమైన భాగం. బెల్లం (Jaggery)ఒక తియ్యటి ఆహార పదార్థం.. అంతే ఔషధాల గని అని కూడా చెప్పవచ్చు.
బెల్లం తినాలంటే ఎక్కువ ప్రయాస పడాల్సిన అవసరం లేదు. బెల్లం కోసం ఎక్కువ డబ్బు ఖర్చుపెట్టాల్సిన అవసరం కూడా ఉండదు. మార్కెట్లో ఇతర ధరలతో పోలిస్తే బెల్లం రేటు కాస్తంత తక్కువే. ఏదో పండగ సందర్భంలో తప్ప బెల్లం జోలికి వెళ్లడం చాలా తక్కువ. ఆ బెల్లమే కదా అని తీసి పారేయకండి. బెల్లంతో ఎన్నో ప్రయోజనాలున్నాయి. ముఖ్యంగా చలికాలంలో బెల్లం తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిదట. ముఖ్యంగా దీంతో శరీరానికి కావాలసిన వేడి అందుతుందని చెబుతారు. అంతేకాదు ఎన్నోరకాల రోగాలను నిరోధించే శక్తి బెల్లానికి ఉంది. ముఖ్యంగా గర్భవతి అయిన స్త్రీలు బెల్లాన్ని సేవిస్తే ఎంతో మంచిదట.ఆయుర్వేదంలోనూ బెల్లానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. చలికాలంలో దగ్గు, జలుబు లాంటి ఎన్నో రోగాలను నిరోధించే శక్తి బెల్లానికి ఉంది. చిటికెడు బెల్లం ముక్క నోట్లో వేసుకుంటే చాలు... రక్తప్రసరణ బాగా జరుగుతుందట. రోజంతా ఆఫీసుల్లో టెన్షన్ టెన్షన్ గా గడిపేవాళ్లకు ఇది ఎంతో మంచిదట.
చెరకు నుండి...
దీనిని సాధారణంగా చెరకు నుండి తయారు చేస్తారు. సాధారణంగా చెరకు రసము నుంచి కొలాసిస్ ను వెలికితీసి బెల్లము తయారు చేస్తారు. తాటికల్లు, ఈతకల్లు, ఖర్జూరము నుంచి బెల్లం తయారుచేస్తారు . బెల్లం తయారిలో వివిధ రాకలు ఉన్నాయి. చెరకు బెల్లం, ఖర్జూర బెల్లం, తాటి బెల్లం, ఈతబెల్లం, కొబ్బరి బెల్లం ఇలా వివిధ రకాలుగా తయారు చేస్తారు. అయితే ఇళ్ళలో వాడేరకం చెరకు బెల్లం. ఇది భారతీయ వంటలలో బెల్లం ఒక ముఖ్యమైన పదార్థం. చెరకు బెల్లము గోల్డ్ బ్రౌన్ కలర్ నుంచి డార్క్ బ్రౌన్ కలర్ లో ఉంటుంది . ఈ బెల్లంను చెరకు రసాన్నిబాగా కాయడం ద్వారా తయారుచేస్తారు. ఈ బెల్లం నేల రకాన్ని బట్టి, నీటి పారుదల సౌకర్యాన్ని బట్టి తెల్లగాను, లేదా నల్లగాను, మెత్తగాను లేదా గట్టిగాను వుంటుంది. దాన్ని బట్టి దానికి ధర వస్తుంది. పంచదార లేదా చక్కెర కంటే బెల్లం ఆరోగ్యపరంగా శ్రేష్టం ఎందుకంటే బెల్లంలో ఇనుము మొదలైన మూలకాలు ఉంటాయి.
బెల్లంలో ఎలాంటి రసాయన పదార్థాల వాడకం ఉండదు. చూశారా బెల్లానికి ఎంత ప్రాధాన్యత ఉందో.. ఇక నుంచి ఆ బెల్లమే కదా అని లైట్ తీసుకోకండి.. కాస్త అప్పుడప్పుడు చిటికెడు బెల్లాన్ని నోట్లో వేసుకుందాం...
ఉపయోగాలు..
ఆయుర్వేద వైద్యశాస్త్రంలో కూడా బెల్లాన్ని చాలా రకాల మందులలో వాడతారు.
పొడి దగ్గు ఇబ్బంది పెడుతుంటే .. గ్లాసు బెల్లం పానకం లో కొద్దిగా తులసి ఆకులు వేసి రోజుకు మూడు సార్లు తీసుకుంటే ఉపసయనం కలుగుతుంది .
అజీర్తి సమస్యతో విసిగిపోయిన వారు భోజనం చేశాక చిన్న బెల్లం ముక్క నోట్లో వేసుకుంటే జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది . అజీర్తి సమస్యలుండవు .జీవ క్రియ ను వేగవంతం చేస్తుంది .
కాకర ఆకులు , నాలుగు వెల్లుల్లి రెబ్బలు (రెక్కలు) , మూడు మిరియాల గింజలు , చిన్న బెల్లం ముక్క వేసి గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని రోజు రెండుపుతల వారం రోజులు తీసుకున్నా , లేదా గ్లాసు పాలలో పంచధరకి బదులు బెల్లం వేసి రోజు త్రాగిన ... నెలసరి సమస్యలు ఉండవు.
నేయ్యి తో బెల్లం వేడిచేసి నొప్పి ఉన్నా చోట పట్టు వేస్తె భాధ నివారణ అవుతుంది .
ముక్కు కారడము తో బాధపడుతున్న వారికి ... పెరుగు , బెల్లం కలిపి రోజుకు రెండు పూటలు తింటే తగ్గుతుంది .
బెల్లం , నెయ్యి .. సమపాళ్ళలో కలిపి తింటే 5 -6 రోజులలో మైగ్రిన్ తల నొప్పి తగ్గుతుంది .
కడుపులో మంటగా ఉన్నప్పుడు బెల్లం చిట్కాను ప్రయోగించవచ్చని పోషణ నిపుణులు సూచిస్తున్నారు. బెల్లంలో పొటాసియం సమృద్ధిగా ఉంటుంది. ఇది కణాల్లో ఆమ్లాలు, అసిటోన్లపై దాడి చేసి ఆమ్ల సమతౌల్యాన్ని కాపాడుతుంది. భోజనం చేసిన తర్వాత ప్రతిసారీ చిన్న బెల్లం ముక్క తినటం ద్వారా అసిడిటీని తగ్గించుకోవచ్చు. ఇలాంటి ప్రయోజనాలు ఉండటం వల్లే బెల్లాన్ని 'మెడిసినల్ సుగర్'గా వ్యవహరిస్తారు.