ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

BRIEF MAHABHARATHA STORY ABOUT SATYAVATHI AND SANTHANUDU


సత్యవతి (మహాభారతం)

సత్యవతి, మహాభారతంలో శంతనుడి భార్య. కౌరవ, పాండవులకు మహాపితామహురాలు. కౌరవ వంశమాత అయన అమె ఒకప్పుడు ఒక సామాన్యపు పల్లె పడతి. దాశరాజు అనే పల్లె పెద్దకు కుమార్తె. ఆమె వళ్ళంతా చేపల కంపు కొడుతుండడంతో ఆమెకు మత్స్యగంధి అన్న పేరుండేది.

* వృత్తాంతము

దాశరాజునకు పెంపుడుకూఁతురు. వ్యాసుని తల్లి. శంతనుని భార్య. శంతనుని వలన ఈమె కనిన కొడుకులు చిత్రాంగదుఁడు, విచిత్రవీర్యుఁడు. ఈమె ఉపరిచర వసువు వీర్యమున శాపముచే మత్స్యమై యమునానదియందు ఉన్న అద్రిక అను అప్సరసకు జనించెను. మఱియు ఈమెకు యోజనగంధి, మత్స్యగంధి అను నామములు ఉన్నాయి. ఈమె కన్యాత్వమున పరాశరమహర్షి వలన సద్యోగర్భము ధరించి కృష్ణద్వైపాయనుని (వ్యాసుని) కనెను.(పురాణనామచంద్రిక (యెనమండ్రం వెంకటరామయ్య) 1879)

* వ్యాసుడి జననం

ఒకమారు సత్యవతి పడవ నడుపుతుండగా పరాశరుడు అనే జ్యోతిశ్శాస్త్ర ప్రవీణుడు అయిన మహాముని ఆమెను కామించాడు. తాపసులకిది తగదని ఆమె అభ్యంతరపెట్టినా అతను నిగ్రహించుకొనలేకపోయాడు. ఆ ముహూర్తానికి అలా జరిగిపోవాలన్నాడు. ఆమె శరీమంతా అతిలోక పరిమళభరితమయ్యేలాగానూ, ఆమె కన్యాత్వం చెడకుండేలాగానూ వరమిచ్చాడు. అలా వారి సంగమం కారణంగా యమునా నదిలో ఒక ద్వీపంలో ఆమె సద్యోగర్భాన (కన్యాత్వం చెడకుండా) జన్మించిన కొడుకే కృష్ణద్వైపాయనుడు లేదా వ్యాసుడు. ఆ పిల్లవాడు పుట్టగానే పన్నెండేళ్ళ ప్రాయునిగా ఎదిగి, తల్లికి ప్రమాణం చేసి, స్మరించినపుడు వచ్చి దర్శనం చేసుకొంటానని మాట యిచ్చి వెళ్ళిపోయాడు. ముని వరం వలన ఆమె ఎక్కడికి వెళ్ళిందీ ఏమయిందీ ఎవరూ అడుగలేదు. ఆమె శరీరం యోజనం మేర సుంధాలు విరజిమ్ముతున్నందున అమె "యోజనగంధి" అయింది.

* శంతనుడితో వివాహం

దేవవ్రతుడు (భీష్ముడు, గాంగేయుడు) అనే కుమారుని హస్తినాపురం రాజైన శంతనునికి అప్పగించి గంగ అతనిని విడచిపోయింది. తరువాత యమునాతీరంలో వేటకు వెళ్ళిన శంతనుడు సత్యవతిని చూసి మోహించాడు. తనకిచ్చి పెండ్లి చేయమని ఆమె తండ్రి దాశరాజును కోరాడు. అయితే తన కుమార్తె సంతతికే రాజ్యం కట్టబెట్టేలాగయితేనే రాజుకు తన కుమార్తెనిస్తానని దాశరాజు చెప్పాడు. తండ్రి ద్వారా ఈ సంగతి తెలిసికొన్న దేవవ్రతుడు దాశరాజు వద్దకు వెళ్ళి తాను ఆజన్మాంతం బ్రహ్మచారిగా ఉంటానని, తను గాని, తన సంతతిగాని రాజ్యం కోసం సత్యవతి సంతానంతో పోటీ పడే సమస్యే రాదని భీషణంగా ప్రతిజ్ఞ చేశాడు. సత్యవతిని తనకు మాతృదేవతగా అనుగ్రహించమని అర్ధించాడు. ఆమెను సగౌరవంగా తోడ్కొని వెళ్ళి తండ్రితో వివాహం జరిపించాడు.

సత్యవతీ, శంతనులకు చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు అనే బిడ్డలు కలిగారు. శంతనుని మరణానంతరం చిత్రాంగదుడు రాజయ్యాడు కాని ఒక గంధర్వునితో యుద్ధంలో మరణించాడు. తరువాత భీష్ముడు విచిత్రవీర్యుని రాజు చేశాడు. అతనికి కాశీరాజు కుమార్తెలు అంబిక, అంబాలికలనిచ్చి పెండ్లి చేశాడు. కామలాలసుడైన విచిత్రవీర్యుడు కొద్దికాలానికే అనారోగ్యంతో, నిస్సంతుగా మరణించాడు.

* దేవరన్యాయం

ఇక వంశపరిరక్షణకు వేరే మార్గం లేదని, భీష్ముని పట్టాభిషేకం చేసుకోమని సత్యవతి కోరింది కాని భీష్ముడు ప్రతిజ్ఞా భంగానికి నిరాకరించాడు. దేవర న్యాయం ప్రకారం పెద్దల అనుమతితో ఉత్తములైన బ్రాహ్మణులతో కోడళ్ళకు ఆధానం జరిపి వంశాన్ని కాపాడుకోవచ్చునని సూచించాడు.

అప్పుడు సత్యవతి తన వివాహపూర్వ వృత్తాంతం భీష్మునితో చెప్పింది. తనకే సద్యోగర్భంలో జన్మించిన వ్యాసునితో కోడళ్ళకు ఆధానం జరుపవచ్చునా అని అడిగింది. వ్యాసుని పేరు వినగానే భీష్ముడు ఆమెకు ప్రణామం చేశాడు. తనను కన్న తల్లియైన గంగవలెనే ఆమె కూడా పరమ పవిత్రమూర్తి అన్నాడు. ఆమె కారణంగా తమ వంశం పావనమైందని అన్నాడు. అనంతరం సత్యవతి వ్యాసుని స్మరించి తమ అవసరం తెలియజెప్పింది.