*అమ్మకానికి ముద్దులు *
ఒక ఎగ్జిబిషన్ జరుగుతోంది. కౌంటర్ వెనుక గులాబిపువ్వుకంటే అందంగా ఉన్న రాణి అనే అమ్మాయి నిలబడి ఉంది.
"అమ్మకానికి ముద్దులు, ఒక్కో ముద్దు కేవలం వందరూపాయలే...!" అని అక్కడ బోర్డు కనిపిస్తోంది.
ఆశగా జేబులోనుంచి ఐదువందల రూపాయల నోటు తీశాడు మాధవరావు "ఐదు ముద్దులివ్వు" అన్నాడు అర్జెంటుగా.
"అలాగే..." అని డబ్బులు తీసుకుని పక్కనే ఉన్న తన బామ్మవైపు తిరిగి రాణి, "బామ్మా ...! ఈయనకి ఐదు ముద్దులివ్వు..." అంది.
వెంటనే డ్రైవర్ వైపు తిరిగాడు మాధవరావు. "పెద్దమ్మగారు ఐదు ముద్దులిస్తారు, తీసుకొనిరా... అని గంభీరంగా చెప్పి వెళ్ళి కార్లో కూర్చున్నాడు.