పడుచు పెళ్ళాం జోక్
ఎనభై ఏళ్ళ ముసలివాడు ఓ డాక్టర్ దగ్గరకెళ్ళాడు.
"డాక్టర్...! నేను ఈ మధ్య ఓ పదహారేళ్ళ అమ్మాయిని పెళ్ళి చేసుకున్నాను. అంతే కాదు తండ్రిని కూడా కాబోతున్నాను. దీనిపై మీ అభిప్రాయం...?" అనడిగాడు.
"నేనో కథ చెప్తాను వినండి. నేనొకసారి అడవికి వెళ్ళాను కాస్తదూరం వెళ్ళేసరికి గాండ్రిస్తూ ఓ పులి వచ్చింది. నా చేతిలో ఓ గొడుగు మాత్రం వుంది. అంతే...! వెంటనే నేను గురి చూసి పులి మీదకు గొడుగు విసిరాను పులి చచ్చిపోయింది..." అన్నాడు డాక్టర్.
"అబద్ధం...! మీరు గొడుగు విసిరే సమయానికి చాటునుండి ఎవరో తుపాకీ గురిపెట్టి పులిని చంపేసి ఉంటారంటాను నేను..." అన్నాడు ముసలివాడు.
"మీ విషయంలోనూ నేను అదే అంటాను..." అన్నాడు డాక్టర్.
ఆటలో ఆనందం జోక్
ఎర్రగడ్డ పిచ్చాసుపత్రిలో రాజయ్య పేషెంటుగా ఉన్నాడు. డాక్టరు రోజూ రాజయ్య దగ్గరకొచ్చి ఒక పది రూపాయలు నోటు, ఒక రూపాయ నాణెం చూపించి ఏది కావాలో తీసుకో అంటున్నాడు. రాజయ్య మాత్రం ఎప్పుడూ రూపాయి నాణెం మాత్రమే తీసుకుంటూ ఉంటాడు.
ఓ రోజు అలాగే నోటు, నాణెం చూపించి "ఏదో ఒకటి తీసుకో" అన్నాడు. రాజయ్య నాణెం తీసుకున్నాడు. డాక్టరు వెళ్ళిపోయాక ప్రక్కనున్న నర్సు రాజయ్యను "రాజయ్యా...! రోజూ డాక్టరు గారు నోటు, నాణెం చూపించినప్పుడు నోటువిలువ ఎక్కువ కనుక అది తీసుకోవచ్చుగా...! అనడిగింది.
"అమ్మా! రూపాయి నాణెం కంటే, పదిరూపాయలు నోటు విలువెక్కువని నాకూ తెలుసు కానీ, నేను నోటు తీసుకుంటే నాకు పిచ్చి తగ్గిపోయిందని డాక్టరుగారు రోజూ ఈ ఆట ఆడటం మానేస్తారుగా..." అన్నాడు రాజయ్య