ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

LORD ANJANEYA SWAMY BHAKTHI PRAYER


అతడు ( పరమాత్మ )
నిత్యులలో కెల్ల నిత్యుడు ........!!
అంటే మనం పంచభూతాలు
శాశ్వతమని అనుకుంటాము 
కానీ -- అవి శాశ్వతాలు కావు
వాటికంటే శాశ్వతుడు పరమాత్మ

చేతనులలో కెల్ల చేతనుడు
అంటే బుద్ధిమంతులైన వారందరికంటే
బుద్ధిమంతుడు అంటే ......
మనం తెలివి గలవి
అని అనుకొనే హృదయం
బుద్ధి మనస్సు ఇంద్రియాలు
వీటి అన్నిటికంటే హనుమంతుడే
తెలవిగలవాడని భావం

అతడు అద్వితీయుడు
తోడు ఎవరూ లేరు
అయినా తనను శరణుజొచ్చిన
వారందరి కోరికలన్నీ తీర్చి అనుగ్రహిస్తాడు
వారి వారి కర్మలను బట్టి పుణ్య పాపాలను
పంచి యిచ్చేది ఆంజనేయుడే
అన్నిటికి కారణమైనవాడు అతడే

అద్వయుడు స్వతంత్రుడు
నిష్కియమైన జడాలు
భక్తుల యొక్క బీజాన్నే
( అద్య ప్రకృతినే ) అనేకంగా చేసేవాడూ
భక్తి హృదయంలోనే ఉన్న పరమాత్మను
శాశ్వతమైనభక్తి ద్వారా తెలుసుకొని
సాక్షాత్కరించుకొన గలిగిన ధీరులైన
వారికే శాశ్వతమైన ఆనందం లభిస్తుంది
=== జై శ్రీరామ్ == జై భజరంగభళి ===

THANKS TO SRI THOTA RAVI KUMAR
FOR HIS ARTICLE IN F.B