ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

MADHURAM SHIVA MANTRAM


బాపు గారి శివ తాండవ చిత్రం

మధురము శివ మంత్రం 
మహిలో మరువక -ఓ! మనసా!
👉🏾కాళహస్తి మహాత్మ్యం చిత్రంలోని ప్రతి ఒక్క పాట,
ప్రతి ఒక్క పద్యం, ఒక రస గుళిక. ఎంతో అద్భుతంగా గానం చేసి పది కాలాలు నిలిచిపోయేలా చేసారు ఘంటసాల మాస్టారు.
ఈ చిత్రం లోని ఇంకొక చక్కని పాట, తోలేటి వెంకట రెడ్డి గారు రచించిన "మధురము శివ మంత్రం".
ఇందులో ఘంటసాల గారు ఎన్ని గమకాలు వాడారో చెప్పనక్కరలేదు. ముఖ్యంగా ఈ పాట పల్లవిలో "ఇహ పర సాధనమే" అన్న పంక్తిని అయిదు విధాలుగా ఒక్కోసారి ఒక్కోలా ఆలపిస్తారు.

సంగీతం: ఆర్. సుదర్శనం, ఆర్.గోవర్ధనం

గానం: ఘంటసాల

ప. మధురము శివమంత్రం మహిలో మరువక ఓ! మనసా! |మధురము|
ఇహపర సాధనమే....ఏ......ఏ.....
ఇహపర సాధనమే..
ఇహపర సాధనమే..
ఇహపర సాధనమే..
ఇహపర సాధనమే నరులకు సురుచిర తారకమే |ఇహపర|
ఆగమ సంచారా
ఆగమ సంచారా, నా స్వాగతమిదె గొనుమా.. |ఆగమ|
భావజ సంహారా...
భావజ సంహారా.....
భావజ సంహారా... నా నన్ను కావగ రావయ్యా |భావజ|
పాలను ముంచెదవో.. ఓ.. ఓ.. ఓ..
పాలను ముంచెదవో, మున్నీటను ముంచెదవో.. |పాలను|
భారము నీదయ్యా |భారము|
పాదము విడనయ్యా, నీ పాదము విడనయ్యా..
జయహే సర్వేశా!
జయహే సర్వేశా! సతి శాంభవి ప్రాణేశా!..ఆ.. |జయహే!|
కారుణ్య గుణసాగరా!..
కారుణ్య గుణసాగరా!
శ్రీకాళహస్తీశ్వరా నన్ను కాపాడవా శంకరా!
కారుణ్య గుణసాగరా!
శ్రీకాళహస్తీశ్వరా నన్ను కాపాడవా శంకరా!
మధురము శివమంత్రం మహిలో మరువక ఓ! మనసా!
ఇహపర సాధనమే నరులకు సురుచిర తారకమే