ఉదయ కిరణాలలోనా.. ఉదయ కిరణాలలోనా
నా హృదయాన కదలాడే నవ రాగ వీణ
ఉదయ కిరణాలలోనా.. నా హృదయాన కదలాడే నవ రాగ వీణ
నా హృదయాన కదలాడే నవ రాగ వీణ
ఉదయ కిరణాలలోనా
ఆ ఆ ఆ
పసరాకులపయి కురిసే వెలుగులు ..ఆ ఆ
పసరాకులపయి కురిసే వెలుగులు
కొస తీవెలపయి విరిసే వెలుగులు
ఆలయ శిఖరాల అంచుల మెరిసి
ఆలయ శిఖరాల అంచుల మెరిసి
నాలో పొంగారు బంగారు వెలుగులు
ఉదయ కిరణాలలోనా
నా హృదయాన కదలాడే నవ రాగ వీణ
ఉదయ కిరణాలలోనా
జగమే కమలమయి వికసించినది ఆ ఆ ఆ
జగమే కమలమయి వికసించినది
మనసే భ్రమరమయి రవలించినది
ఆ భగవానుని ఆరని కళలు
ఆ భగవానుని ఆరని కళలు
అణువూ అణువున పులకించినవి
ఉదయ కిరణాలలోనా
నా హృదయాన కదలాడే నవ రాగ వీణ
ఉదయ కిరణాలలోనా
THANKS TO SAMMETA UMA DEVI GARU
FOR HER EXCELLENT POSTING
Movie: Pala Manasulu (1968)
Lyricist: C.Narayana Reddy
Music: Sathyam
Singer: S.Janaki