ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

బంధానుకుంటాం కానీ.. telugu poetry

బంధానుకుంటాం కానీ..

ఎదురయిన చోటునే తేడాల  నదుల్లో
చిక్కుకుపోతుంటాం..
ఎంతో ఆశించిన మనుషుల మధ్య
చలనం లేని వస్తువుగా మిగిలిపోతుంటాం..
ఎన్నో మాట్లాడానుకుని వెళ్ళిన మనం
నిశ్శబ్ధ వాకిళ్ళుగా ఉండిపోతాం..
చేతులన్నీ అచేతనాలై
అబద్ధాల  ఆత్మీయతలతో ఆశ్చర్య చిత్రాలయిపోతుంటాం .. ..

అంతస్తును బట్టి అనుబంధాు మారుతుంటాయి
అనేక సందర్భాలో దగ్ద దృశ్యాల్లా నిలిచి
కృంగిపోయిన గుండెను ఓదార్చుతూ
నిరాశ జలాశయంలో కొట్టుకుపోతుంటాం...
అయినా వెళ్ళేటప్పుడు చేతికందించిన
జిలుగు చేతిరుమాలుకు మురిసిపోతూ
కాలాన్ని తిట్టుకుంటూ మళ్ళీ వస్తామంటూ
ఆశ పందిళ్ళు వేసుకుని వెళ్ళిపోతుంటాం.
మొహమాటంతో పిలిచిన ఛాయాచిత్రాలకు దాసులైపోతుంటాం..

ప్రేమే లేని ఈ వింత బంధాల్లో
వాస్తవం కనిపించని సన్నివేశాల  మధ్య
ఇంటిగుమ్మం నుండి ఎవరికి వారే ..
వీథి చివరికెళ్ళి ఒక్కసారి వెనక్కు చూస్తే
గుమ్మంలో ఎవరూ మనకోసం ఉండరు.
మళ్ళీ విధిని అనుసరిస్తూ నడిచే బాటసారులైపోతాం..

బంధానుకుంటాం.. కానీ
బాధల్ని, అవమానాల్ని, ఒంటరితనంతో పాటు
గుప్పెడు అనుభవాల్ని ఇంటికి మోసుకుపోతాం..
జాలిగా చూస్తున్న మన వాకిలి తెరిచి
చేతిలోని వస్తువు మూటను ఒక వారగా జారవేస్తాం
గుండె భారాన్ని మోసుకుంటూ
ఇంటినంతా కలియదిరిగి కాఫీ సంతకాలను ఆశ్రయిస్తాం..
ఎంత కాదనుకున్నా
అల్లుకున్న అనుబంధాల  బూటకాలను నమ్మి..
వదలలేక మళ్ళీ మరో పిలుపుకు లొంగిపోతుంటాం..

శైలజామిత్ర