ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

BAGARA EGG CURRY

బగారా అండా కర్రీ

కావాల్సినవి:
గుడ్లు-నాలుగు
నువ్వులు-25 గ్రా
వేరుసెనగ పప్పు- 25 గ్రా
ధనియాల పొడి- 1టీ స్పూన్
కొబ్బరి-30 గ్రా
చింత పండు-30 గ్రా
కరివేపాకు- 4రెబ్బలు
కారం- 10గ్రా
ఆవాలు-చిటికెడు
ఎండుమిర్చి-మూడు
మెంతులు-చిటికెడు
ఉప్పు-తగినంత
నూనె- 60 గ్రా
తయారు చేసే విధానం:
1)గుడ్లను పావు గంట సేపు ఉడికించి,దించి పెంకు ఒలిచి చాకుతో గాట్లు పెట్టండి.
2)ఒక గిన్నెలో నూనె పోసి కాచాక -ఆవాలు,మెంతులు,ఎండుమిర్చి,కరివేపాకుతో తాలింపు పెట్టండి.
3 )ఆ తరువాత నువ్వులు,వేరుసెనగపప్పు,కొబ్బరి,వేయించి మెత్త గా నూరి మసాలా ముద్దను తయారు చేయండి.
4)ఇప్పుడు ఈ మసాలాను తాలింపు లో వేసి,కొంచెం సేపు వేయించండి.నూనె ఆ ముద్ద నుండి విడిపోతున్నప్పుడు కారం,పసుపు వేసి కలిపాక-చింత పండు పులుసు పోసి ఉడికించండి.తరువాత తగినంత ఉప్పు కలిపి గ్రేవీలా తయారయ్యాక ఉడకబెట్టిన గుడ్లను వేసి ,కాసేపు ఉడికిస్తే బగారా అండా కర్రీ రెడీ.... ఇది రైస్ తో వడ్డిస్తే బావుంటుంది......