ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

VAKKAYYA COCONUT CHUTNEY

వాక్కాయ కొబ్బరి పచ్చడి

కావలసినవి:
వాక్కాయలు- 100 గ్రా
పచ్చిమిర్చి-పది
వాలు-1 టీ స్పూన్
జీలకర్ర- 1టీ స్పూన్
పచ్చి కొబ్బరి-ఒకటి
నూనె-3 టీ స్పూన్లు
పసుపు-1/2టీ స్పూన్
మినపప్పు -1 టీ స్పూన్
సెనగ పప్పు- 1టీ స్పూన్
ఎండుమిర్చి-మూడు
ఉప్పు-తగినంత
తయారు చేసే విధానం:
1)వాక్కాయలను చాకుతో కోసి మద్య లో గింజలను తీసేయండి.
2)తరువాత బాణలి లో ఒక చెంచా నూనె పోసి కాచాక ,అందులో కొంచెం ఆవాలు,జీలకర్ర వేసి ఫ్రై చేసాక అందులోనే పచ్చి మిరపకాయలు వేసి దించి,దానికి కొబ్బరి ముక్కలు,పసుపు,గింజలు తీసిన వాక్కాయలు,తగినంత ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేయండి.
3)ఇప్పుడు గ్రైండ్ చేసిన పచ్చడికి మిగిలిన ఆవాలు,జీలకర్ర,సెనగపప్పు,మినప్పప్పు,ఎండుమిర్చిలతో తాలింపు ఇచ్చి బాగా కలియబెట్టి రైస్ తో వడ్డించండి.........