ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

CHAKRA PONGALI - SWEET RECIPE

చక్ర పొంగలి

కావాల్సినవి: 
బియ్యం - కిలో
పెసరపప్పు - పావు కిలో
జీడిపప్పు- పది
కిస్ మిస్- పది
యాలకులు-ఎనిమిది
నెయ్యి-ఒక కప్పు
బెల్లం- తగినంత
పచ్చికొబ్బరి చిప్ప- ఒకటి
ఉప్పు- చిటికెడు,పాలు-ఒక కప్పు
తయారు చేసే విధానం :
1)పెసరపప్పు, బియ్యం శుభ్రంగా కడిగి చిటికెడు ఉప్పు వేసి మెత్తగా ఉడికించుకోవాలి . సరిపడినంత బెల్లం తీసుకుని చిక్కగా పాకం పట్టి బాగా ఉడికిన బియ్యం ,పెసరప్పు మిశ్రమంలో పోసి బాగా కలపాలి.
2 ) పొయ్యి మీద భాణలి పెట్టి దానిలో నెయ్యి వేసి జీడిపప్పు,కిస్మిస్ ,చిన్నగా కట్ చేసిన పచ్చి కొబ్బరి ముక్కలు అన్ని బాగా వేయించాలి.
3 ) తరువాత వీటిని పొంగలి లో వెయ్యాలి.యాలకులను పొడి కొట్టి పైన చల్లితే వేడి వేడి చక్ర పొంగలి రెడీ...