ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

CURD RICE

కర్డ్ రైస్

కావాల్సినవి:
పాలు - రెండు లీటర్లు
బియ్యం -ముప్పావు కేజి
పచ్చి మిర్చి -నాలుగు
అల్లం - చిన్న ముక్క
కేరెట్ -ఒకటి
ఆవాలు- రెండు స్పూన్లు
జీలకర్ర-రెండు స్పూన్లు
సెనగ పప్పు- మూడు స్పూన్లు
మినపప్పు-రెండు స్పూన్లు
జీడి పప్పు - గ్రాములు
ఎండు మిర్చి-
కరివేపాకు -మూడు రెమ్మలు
ఉప్పు - తగినంత
కొత్తిమీర - ఒక కట్ట

తయారు చేసే విధానం :1) అన్నం మెత్తగా వండాలి. పాలు కూడా కాచి తోడు వేసి పెరుగు పులుపు రాకుండా రెడీ చేసుకోవాలి.
2) ఇప్పుడు వండుకున్న అన్నాన్ని బాగా చల్లారబెట్టాలి.ఇప్పుడు ఈ అన్నంలో అప్పుడే తోడుకున్న పెరుగుని వేసి బాగా కలపాలి.
3) ఇప్పుడు ఈ పెరుగు అన్నంలో తగినంత ఉప్పు,చిన్నగా కట్ చేసిన పచ్చి మిర్చి ముక్కలు,సన్నగా తురిమిన కేరెట్ వేసి బాగా కలపాలి.
4) ఇప్పుడు పొయ్యి మీద గిన్నె పెట్టి అందులో ముందుగా నూనె వేసి ,అది కాగిన తరువాత అందులో సెనగపప్పు,మినపప్పు,జీడిపప్పు వేసి అవి దోరగా వేగిన తరువాత జీలకర్ర,ఆవాలు,ఎండుమిర్చి,చిన్నగా తరిగిన అల్లం ముక్కలు,చివరిగా కరివేపాకు వేసి దోరగా వేయించాలి.అవి బాగా వేగిన తరువాత దించి పక్కన పెట్టి చల్లార్చి చల్లారిన తరువాత ముందుగా కలిపి పెట్టుకున్న పెరుగు అన్నంలో వేయించి పెట్టుకున్నతాలింపును నూనె రాకుండా జాగ్రతగా వేయాలి. ఇప్పుడు ఈ తాలింపు అంతా కలిసేలా పెరుగు అన్నాన్ని బాగా కలపాలి. 
5) ఇప్పుడు దాని తరిగిన కొత్తిమీర తో పైన అలంకరిస్తే కర్డ్ రైస్ రెడీ..దీన్ని కొంత సేపు ఫ్ర్రిజ్జ్ లో పెడితే చల్ల చల్లగా చాలా బావుంటుంది.