చాంద్ బిస్కట్స్
కావాల్సినవి:
మైదా - 500 గ్రా
పంచదార పొడి-పావు కేజి
యాలకులు- 3గ్రా
వనస్పతి -పావు కేజీ
తయారు చేసే విధానం:
1) మైదాను జల్లించండి.మద్యలో గొయ్యిలా చేసి ,వనస్పతి వేసి బాగా తెల్లగా అయ్యేవరకు ఉంచండి.పిదప పంచదార పొడి చేర్చండి.ఇందులో కొద్దిగా మైదాను చేర్చుతూ ముద్దలా చేయండి.
2 )మైదా అంతా కలిసిన తరువాత బాగా కలిపి మర్దన చేసి పిండి ముద్దలా చేస్తే మెత్తగా తయారు అవుతుంది.ఆ పైన యాలకుల పొడి కలపండి.
2 )మైదా అంతా కలిసిన తరువాత బాగా కలిపి మర్దన చేసి పిండి ముద్దలా చేస్తే మెత్తగా తయారు అవుతుంది.ఆ పైన యాలకుల పొడి కలపండి.
3 ) ఈ ముద్దను పీట మీద ఉంచి మందంగా ఉన్నా చపాతీలా చేయండి. పదును ఉన్నా గ్లాస్ తో ఆ చపాతి గట్టిగా అద్దితే బిస్కట్లు రూపొందుతాయి.వీటిని ఒక ట్రేలో అమర్చి నూట ఎనభయి డిగ్రీల దగ్గర ఇరవయ్ నిమిషాలు బెక్ చేయండి .చాంద్ బిస్కట్స్ రెడీ....చల్లారిన తరువాత ఆరగించండి.