ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

ATUKULU DOSA

అటుకుల దోశ

కావాల్సినవి:
బియ్యం-2 కప్పులు
అటుకులు- అర కప్పు
చిక్కని,పుల్లటి పెరుగు-31/2 కప్పులు
మెంతులు-ఒక టీ స్పూన్
వంటసోడా -పావు టీ స్పూన్
ఉప్పు-అర టీ స్పూన్
నూనె -తగినంత
తయారు చేసే విధానం:
1) ముందుగా అటుకులను ,బియ్యాన్ని,మెంచేసుకోవాలి.తులను,చిక్కటి పుల్లగా వున్నపెరుగులో ఓరాత్రంతా నానబెట్టుకోవాలి.మర్నాడు నానబెట్టుకున్న వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
2 )తరువాత ఈ పిండిలో ఉప్పు,వంటసోడా కలిపి ఒక రెండు గంటలు పక్కన వుంచాలి.
3 )తరువాత అట్లు వేసే పెనం పొయ్యి మీద పెట్టి వేడి అయ్యాక నీళ్లు జల్లి ఆ పైన ముందుగా రడీ గా వుంచుకున్న పిండి ని కొంచెం మందంగా వుండేలా అట్లు వేయాలి.దోశ ఒక వైపు కాలాక రెండో వైపు కూడా తిప్పి కాలాక తీసేయ్యాలి.అంతే వేడి వేడి అటుకుల దోశ తినడానికి రడీ... ఈ దోశ కొబ్బరి చట్నీ,వేరుసెనగ పప్పుచట్నీ తో కూడా బావుంటాయి.