ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

CHICKEN CREAM STICKS

చికెన్ క్రీమ్ స్టిక్స్

కావాల్సినవి:
చికెన్ (ఎముకలు లేనిది)- 250 గ్రా
వేరుసెనగ గుళ్ళు- 25 గ్రా
పెరుగు మీగడ- 30 గ్రా
నిమ్మకాయ- అర చెక్క
అల్లం-చిన్న ముక్క
కొత్తిమీర-ఒక కట్ట
పచ్చి మిర్చి-నాలుగు
యాలకులు-మూడు
ఉప్పు-తగినంత
నూనె-రెండు టీ స్పూన్లు
తయారు చేసే విధానం:
1 ) ముందుగా ఒక గిన్నెలో ఎముకలు లేని చికెన్ ముక్కల్ని వేసి,వాటిని ఫ్రై చేసి ముద్ద గా నూరిన వేరుసెనగ గుళ్ళు,పెరుగుమీగడ,తురుమిన అల్లం,సన్నగా తరిగిన పచ్చిమిరపకాయముక్కలు,దంచిన యాలకులు,తగినంత ఉప్పు కలిపి ఒక గంట సేపు నానబెట్టండి.
2 ) తరువాత నానిన ఒక్కో చికెన్ ముక్కను సన్నని వెదురు పుల్లకు గుచ్చి బొగ్గుల వేడి మీదగాని,గ్రిల్లర్ లో గాని,గ్యాస్ మంట మీదగాని కాల్చి,వెజిటబుల్ సలాడ్,నిమ్మ చెక్కలతో అతిధులకు అందించండి.