ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

VEGETABLE PIN WHEELS

వెజిటబుల్ పిన్ వీల్స్

కావాల్సినవి:
బ్రెడ్ స్లయిస్లు -ఆరు
బఠానీలు- 50 గ్రా
బంగాళదుంపలు - 50 గ్రా
ఉల్లిపాయలు-ఒకటి
పచ్చిమిర్చి-రెండు
పసుపు-చిటికెడు
వెన్న- 100 గ్రా
కొత్తిమీర-ఒక కట్ట
ఉప్పు-తగినంత
తయారు చేసే విధానం:1 ) ఒక గిన్నెలో కొంచెం వెన్న వేడి చేసి అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయముక్కల్ని వేయించాక పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసి ఫ్రై చేయండి. ఆ తరువాత ఉడికించి,మెత్తగా చేసిన బంగాళాదుంపల గుజ్జును వేసి కలియబెడుతూ,ఉడికించిన బఠానీలు కూడా కలిపి,దానికి కొంచెం పసుపు,కొత్తిమీర,తగినంత ఉప్పు కలిపి కూరను తయారు చేయండి.
2) తరువాత ఒక్కో బ్రెడ్ స్లయిస్ కు పక్క బాగాలు కోసి వాటి పైన తయారు చేసిన ఆలు కూరను పూసి బ్రెడ్ స్లయిస్ ను ఒక సైడ్ నుండి చాపలా చుట్టండి.ఇలా చుట్టిన బ్రెడ్ రోల్ విడిపోకుండా ఎడం ఎడంగా రెండు టూత్ పిక్స్ గుచ్చండి. ఆ తరువాత పుల్లకు పుల్లకు మద్య గా చాకు తో కొస్తే ఒక్కో చుట్ట రెండు ముక్కలుగా అవుతుంది.
3) ఇప్పుడు పెనం మీద వెన్న వేసి,స్టవ్ మీద పెట్టి సన్నని మంట మీద బ్రెడ్ రోల్ల్స్ ను కలియబెడుతూ ఎర్రగా ఫ్రై చేసి,టమోటా సాస్ తో ఆరగించండి.