ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

CHOCLATE FOODING

చాక్లెట్ పుడ్డింగ్

కావసినవి
పాలు -అర లీటరు
కోకో పౌడర్ - 50 గ్రా
గుడ్లు -మూడు
పంచదార - 100 గ్రా
వెన్న - 60 గ్రా
మైదా - 3 టేబుల్ స్పూన్స్
కార్న్ ఫ్లోర్ - 3టేబుల్ స్పూన్స్ 
తయారు చేసీ విధానం 
1) ఒక గిన్నె లో కోకో పౌడర్ ,కార్న్ ఫ్లౌర్ ,కొన్ని నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టి కలుపుతూ సాస్ తయారుచేయండి.
2)తరువాత వేరే గిన్నె లో కోడిగుడ్ల మిశ్రమాన్ని పోసి ,అందులో పంచదార కలిపి బాగాకలియబెట్టండి.ఆ తరువాత ఆ గిన్నె లోనే పాలు కూడా పోయండి. 
3)ఇప్పుడు అందులో పైన తయారు చేసి ఉంచిన చాక్లెట్ సాస్ ను పోసి మిశ్రమంలాచేయండి.తరువాత వెన్న పూసిన గిన్నె లో ఈ పాల మిశ్రమాన్ని పోసి గిన్నె మీద మూత పెట్టి స్టీంలో గాని,స్టీం పైన గాని పది నిమిషాల పాటు ఉడికించి తీసి,ముక్కలు గా కోస్తే చాక్లెట్ పుడ్డింగ్ తినడానికి రెడీ ..........