ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

PANNEER CHILLI FRY

పనీర్ చిల్లి ఫ్రై

కావాల్సినవి:
పనీర్- 200 గ్రా
కార్న్ ఫ్లోర్ -50 గ్రా
మైదా - 30 గ్రా
అల్లం వెల్లుల్లి -5 గ్రా
మిరియాల పొడి-చిటికెడు
పచ్చి మిర్చి - 50 గ్రా
వెల్లుల్లి- 25 గ్రా
సోయా సాస్-10 గ్రా
చైనా సాల్ట్ -3 గ్రా
కొత్తి మీర్ - 2కట్టలు
నూనె-ఫ్రై చేయడానికి సరిపడా
ఉప్పు-తగినంత
తయారు చేసే విధానం:
1 )పనీర్ ను కొంచెం పెద్ద ముక్కలు గా కట్ చేసి వుంచండి.
2 )తరువాత ఒక వెడల్పాటి గిన్నెలో కార్న్ ఫ్లోర్ ,మైదా పిండిలను కలిపి,ఆ మిశ్రమానికి అల్లం వెల్లుల్లి ముద్ద,మిరియాల పొడి ,తగినంత ఉప్పు,కొంచెం నీళ్లు కలిపి బజ్జీల పిండిలా కలియబెట్టి పనీర్ ముక్కల్ని ముంచి బాణలి లో కాగుతున్న నూనె లో బాగా ఫ్రై చేసి తీసుంచండి.
3 )తరువాత ఒక గిన్నెను స్టవ్ మీదుంచి,నూనె పోసి కాగాక ,ముందుగా సన్నని చిన్నగా తరిగిన వెల్లుల్లిముక్కల్ని వేసి ఎర్రగా ఫ్రై చేసాక,పచ్చి మిర్చి చీలికలను కూడా వేసి ఫ్రై చేయండి.
4 )ఇప్పుడు పనీర్ బజ్జీలను కలిపి కలియబెడుతూ ,దానిలో సోయా సాస్,చైనా సాల్ట్,సన్నగా తరిగిన కొత్తిమీర ,తగినంత ఉప్పు చేర్చి ఫ్రై చేయండి.
5)తరువాత ఒక టీ స్పూన్ కార్న్ ఫ్లోర్ ను అర కప్పు నీళ్ళలో కలిపి పనీర్ చిల్లి ఫ్రై మీద పోస్తూ కలియబెడుతూ,పొడి గా అయ్యేంత వరకూ ఫ్రై చేసి దించి,ఫ్రైడ్ రైస్ తో గాని,పరోటా తో గాని సర్వ్ చేయాలి..............